Baby Actress: అక్క హిట్ అందుకోగానే యాటిట్యూడ్ చూపిస్తున్న తమ్ముడు?

యూట్యూబర్ గా పలు వీడియోలు చేస్తూ అనంతరం వెబ్ సిరీస్ లలో నటించే అవకాశాలను అందుకున్నారు నటి వైష్ణవి చైతన్య. ఇలా వెబ్ సిరీస్ ల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వైష్ణవి చైతన్య అనంతరం సినిమాలలో అవకాశాలను అందుకొని హీరోలకు చెల్లెలి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు.ఇలా తన నటనతో అందరిని ఆకట్టుకున్నటువంటి వైష్ణవి చైతన్యకు ఏకంగా హీరోయిన్ గా సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే వైష్ణవి చైతన్య ఆనంద్ దేవరకొండ హీరోగా సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి బేబీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద విజయాన్ని అందుకొని సంచలనం సృష్టించింది ఈ సినిమా ఊహించని విధంగా సక్సెస్ కావడంతో ప్రస్తుతం వైష్ణవి చైతన్య పేరు సోషల్ మీడియాలోనూ సినీ ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో నటి వైష్ణవి చైతన్యకు వరుసగా తెలుగు సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి. ఇకపోతే తాజాగా వైష్ణవి చైతన్య (Baby Actress) తన తమ్ముడితోపాటు విజయ్ దేవరకొండతో కలిసి ఒక ఫోటో దిగారు.

ప్రస్తుతం ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త భారీగా ట్రోల్స్ ఎదుర్కొంటుంది. ఈ ఫోటోలో ముఖ్యంగా వైష్ణవి చైతన్య తమ్ముడు కాస్త యాటిట్యూడ్ చూపించడంతో విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ ఫోటోలలో భాగంగా వైష్ణవి చైతన్య విజయ్ దేవరకొండ మధ్యలో వైష్ణవి చైతన్య తమ్ముడు ఉన్నారు.అయితే ఈయన ఏకంగా విజయ్ దేవరకొండపై చేయి వేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చారు.

దీంతో విజయ్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. అసలు నువ్వు ఏమైనా హీరో అనుకుంటున్నావా విజయ్ దేవరకొండ పైనే చేయి వేశావు. ఆయన ఏమైనా మీ ఇంటికి వచ్చి నీతో ఫోటోలు దిగారా?ఇలాంటి ఆటిట్యూడ్ కాస్త తగ్గించుకుంటేనే మంచిది అంటూ తీవ్ర స్థాయిలో వైష్ణవి చైతన్య తమ్ముడిపై మండిపడుతున్నారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags