మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఎప్పుడు ఏం చేస్తారో ఊహించడం కష్టం. హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేయడం ఆయన స్టైల్. రీసెంట్ గా ఆయన చేసిన ప్రయోగాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. కమర్షియల్ సక్సెస్ కోసం గట్టిగా ట్రై చేస్తున్న విశ్వక్, ప్రస్తుతం ‘జాతిరత్నాలు’ డైరెక్టర్ అనుదీప్ తో ‘ఫంకీ’ అనే సినిమా చేస్తున్నారు. ఇది సెట్స్ మీద ఉండగానే, ఎవరికీ తెలియకుండా మరో సినిమాను సైలెంట్ గా మొదలుపెట్టేశారట.
ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, ఈ సినిమాకు ‘లెగసీ’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇది ఒక పొలిటికల్ డ్రామా అని తెలుస్తోంది. సాధారణంగా విశ్వక్ సినిమా అంటే ఓపెనింగ్స్, పూజా కార్యక్రమాలు హడావిడిగా ఉంటాయి. కానీ ఈసారి మాత్రం చాలా సీక్రెట్ గా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. అయితే ఇక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం దర్శకుడి ఎంపిక.
ఈ సినిమాను సాయి కిరణ్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. గతంలో ఈయన ‘పిండం’ అనే హారర్ సినిమా తీశారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. మొదటి సినిమా నిరాశపరిచినా, విశ్వక్ సేన్ లాంటి క్రేజీ హీరో ఆయనకు అవకాశం ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫ్లాప్ డైరెక్టర్ ను నమ్మి విశ్వక్ రిస్క్ చేస్తున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి.
అయితే విశ్వక్ ను ఒప్పించింది కేవలం కథే అని ఇన్ సైడ్ టాక్. సాయి కిరణ్ చెప్పిన పొలిటికల్ పాయింట్ విశ్వక్ కు బాగా నచ్చిందట. కాంబినేషన్ క్రేజ్ కంటే కంటెంట్ ను నమ్మి ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సాయి కిరణ్ కేవలం దర్శకత్వమే కాకుండా, ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు కూడా చూసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎప్పుడూ లేని విధంగా విశ్వక్ కెరీర్ లో ఒక స్ట్రాంగ్ హిట్ అవసరం ఉంది. ఇలాంటి టైమ్ లో ప్రయోగం చేయడం సాహసమే. కానీ రాజకీయ నేపథ్యంలో వచ్చే కథలకు ఆడియన్స్ ఎప్పుడూ కనెక్ట్ అవుతారు. కథలో దమ్ముంటే డైరెక్టర్ ట్రాక్ రికార్డ్ తో పనిలేదని విశ్వక్ నమ్ముతున్నారు.