తెలుగులో పాప్ సాంగ్స్ అంటే గుర్తొచ్చే పేరు స్మిత. సోషల్ మీడియా లేని రోజుల్లోనే తన ఆల్బమ్స్ తో యూత్ ను ఊపేసింది. అయితే సింగర్ గానే కాకుండా ఆమెలో ఒక నటి కూడా ఉంది. గతంలో వెంకటేష్ ‘మల్లీశ్వరి’, నాగార్జున ‘కింగ్’ సినిమాల్లో మెరిసింది. అంత మంచి ఆఫర్లు వచ్చినా, సడెన్ గా ఆమె సినిమాలకు ఎందుకు దూరమయ్యారో ఇన్నాళ్లకు క్లారిటీ ఇచ్చారు.
సాధారణంగా ఇండస్ట్రీలో డైరెక్టర్లు కథ చెప్పేటప్పుడు ఒకటి చెప్తారు, తీరా సెట్స్ మీదకు వెళ్లాక మరొకటి తీస్తారు. సరిగ్గా స్మిత విషయంలో కూడా అదే జరిగిందట. ముఖ్యంగా ‘మల్లీశ్వరి’ సినిమాలో తన పాత్ర విషయంలో దర్శకుడు చెప్పింది ఒకటి, చివరకు తెరపై వచ్చింది మరొకటి అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఒక్క అనుభవంతో సినిమాల్లో నటించకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నారట.
సిల్వర్ స్క్రీన్ కు దూరంగా ఉన్నా, ఇప్పుడు తన సొంత గడ్డ అయిన ఇండిపెండెంట్ మ్యూజిక్ లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. దాదాపు 20 ఏళ్ల క్రితం సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘మసక మసక చీకటిలో’ పాటను ఇప్పుడు రీమిక్స్ చేసి మళ్ళీ తీసుకువచ్చారు. రీసెంట్ గా బిగ్ బాస్ వేదికగా ఈ పాటను లాంచ్ చేసి ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేశారు. నటనకు గుడ్ బై చెప్పినా, మ్యూజిక్ ఆల్బమ్స్ తో మాత్రం టచ్ లో ఉంటానని స్మిత ప్రామిస్ చేశారు.
అప్పట్లో ఎలా ఉండేవారో, ఇప్పుడు అంతకంటే స్లిమ్ గా, ఫిట్ గా మారిపోయి షాక్ ఇచ్చారు. ఓవైపు బిజినెస్ ఉమెన్ గా రాణిస్తూనే, మరోవైపు తన ప్యాషన్ అయిన సింగింగ్ వైపు మళ్ళీ అడుగులు వేస్తున్నారు. ఇకపై వరుసగా మ్యూజిక్ వీడియోలు చేస్తానని, ఫ్యాన్స్ కు దగ్గరగా ఉంటానని స్మిత తెలిపారు. మొత్తానికి ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత తెలుగు పాప్ క్వీన్ మళ్ళీ మైక్ పట్టుకోవడం సంగీత ప్రియులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమె ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.