పాన్ ఇండియా అంటూ అనౌన్స్ చేసే ప్రాజెక్టులు .. చిన్న సినిమా మార్కెట్ ను దెబ్బ తీస్తున్నట్లు కొందరు సినీ ప్రముఖులు కామెంట్లు చేస్తున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. వాటి పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. ప్రమోషన్ బాగా చేసుకుని ఆ కంటెంట్ జనాలకు రీచ్ అయితే తప్ప జనాలు ధియేటర్ కి రాని పరిస్థితి ఏర్పడింది. కొంచెం బెటర్ క్యాస్టింగ్ ఉన్న సినిమాలకి మాత్రమే ఓటీటీ నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. సో చిన్న సినిమాలకి చాలా గడ్డుకాలం ఇది.
ఓటీటీ రైట్స్ బాగా వెళితే తప్ప చిన్న సినిమా నిర్మాత సేఫ్ అవ్వడం లేదు. అందుకే చాలా మంది చిన్న నిర్మాతలు .. కొత్త సినిమాలు నిర్మించడం మానేసి పెద్ద సినిమాలకి ఫైనాన్స్ చేసుకోవడం బెటర్ అన్నట్టు డిసైడ్ అయిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సామజవరగమన , బేబీ వంటి చిత్రాలు చిన్న సినిమాకి ఊపిరి పోసాయి అని చెప్పాలి. ముఖ్యంగా ఓవర్సీస్ లో చిన్న సినిమాలకి ఎక్కువ థియేట్రికల్ బిజినెస్ జరగడం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో సామజవరగమన , (Baby Movie) బేబీ సినిమాలు ఓవర్సీస్ లో భారీ కలెక్షన్స్ నమోదుచేశాయి. బేబీ హాఫ్ మిలియన్ పైనే కలెక్ట్ చేసింది. సామజవరగమన అయితే వన్ మిలియన్ పైనే కలెక్ట్ చేసింది. పెద్ద సినిమాలు కూడా ఈ సినిమాల రేంజ్ లో కలెక్ట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాయి. అలాంటిది ఈ సినిమాలు అసాధారణమైన కలెక్షన్స్ సాధించడంతో చిన్న సినిమాలు ఊపిరి పీల్చుకున్నట్టయ్యాయి.
హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!
అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!