విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ‘బేబీ’ చిత్రం జూలై 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘మాస్ మూవీ మేకర్స్’ బ్యానర్ పై ఎస్.కె.ఎన్ నిర్మించారు. విరాజ్ అశ్విన్ మరో హీరోగా నటిస్తుండగా వైష్ణవి హీరోయిన్ గా నటించింది. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. ఇక మొదటి రోజు కూడా ఈ మూవీ పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంది.
దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద చాలా బాగా కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది . ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 16.12 cr |
సీడెడ్ | 5.77 cr |
ఉత్తరాంధ్ర | 6.25 cr |
ఈస్ట్ | 2.81 cr |
వెస్ట్ | 1.75 cr |
గుంటూరు | 2.10 cr |
కృష్ణా | 2.25 cr |
నెల్లూరు | 1.22 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 38.27 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 3.14 cr |
ఓవర్సీస్ | 2.70 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 44.11 cr (షేర్) |
బేబీ (Baby Movie) మూవీకి రూ. 5.8 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.6.2 కోట్ల షేర్ ను రాబట్టాలి. రెండు రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ ఫుల్ రన్ ముగిసేసరికి రూ.44.11 కోట్లు షేర్ ను రాబట్టింది.ఫైనల్ గా ఈ మూవీ రూ.37.91 కోట్ల భారీ లాభాలను అందించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?