Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్య డేట్స్‌ కావాలంటే… వారికి మాత్రమే సొంతమట!

ఓవర్‌ నైట్‌ స్టార్‌ అని అంటుంటారు తెలుసా? ఒక్క సినిమాతో రాత్రికి రాత్రే స్టార్‌ అయిపోయినవాళ్లను అలా అంటారు. అలా ప్రస్తుతం స్టార్‌ అయిన నటి వైష్ణవి చైతన్య. ఇప్పటికే సోషల్‌ మీడియాలో స్టార్‌ అయిన ఆమె… సినిమాల్లో స్టార్‌ అయిపోయింది అని చెప్పాలి. తెలుగు అమ్మాయిలు హీరోయిన్లు అవ్వడం లేదు అని డైలాగ్‌ నిజం కాదని తేలుస్తూ.. వైష్ణవి చైతన్య అదరగొట్టింది. అయితే ఇప్పుడు ఆమె కోసం వరుసగా నిర్మాణ సంస్థలు ఎంక్వైరీలు చేస్తున్నాయట. కానీ ఇప్పటికప్పుడు ఆమె వేరే నిర్మాణ సంస్థలో చేసే అవకాశం లేదు అంటున్నారు.

‘బేబీ’ సినిమాలో తెలుగు అమ్మాయే ఉండాలని ద‌ర్శ‌కుడు సాయి రాజేష్ ప‌ట్టుబ‌ట్టి మ‌రీ వైష్ణ‌వి చైత‌న్యను సినిమాలోకి తీసుకున్నారు. అప్పటికే కొన్ని వెబ్‌ సిరీస్‌లు చేసిన వైష్ణవి చైతన్య.. ‘అల వైకుంఠపురములో’ సినిమాతో పెద్ద తెరపై కనిపించింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు చేసింది. ‘బేబీ’ సినిమాతో హీరోయిన్‌ అయిపోయింది. అయితే ఈ క్రమంలో మూడు సినిమాలు నిర్మాత ఎస్‌కేఎన్‌కే చేస్తాను అని చెప్పిందట. దీంతో ఇప్పటికిప్పుడు ఆమె బయట బ్యానర్‌లో నటించే అవకాశం లేదట.

‘బేబీ’ సినిమాలో వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) తన అభిన‌యంతో అదరగొట్టింది. కొన్ని బోల్డ్ సీన్స్‌లో కూడా న‌టించి షాక్ ఇచ్చింది. వైష్ణ‌విలో ఇంత ప్ర‌తిభ ఉందా అని చాలామంది ఆశ్చ‌ర్య‌పోయారు కూడా. ఈ క్రమంలో ఆమె తర్వాతి రెండు సినిమాలు ఎస్‌కేఎన్‌ బ్యానర్‌ మీదనే చెయ్యాలట. ఎస్‌కేఎన్‌ అంటే గీతా ఆర్ట్స్‌కు బాగా దగ్గర. దీంతో వైష్ణవి చైతన్య తన నెక్స్ట్‌ రెండు సినిమాలు గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో ఉండొచ్చు అంటున్నారు. అయితే ఏ సినిమాలో ఆమె నటిస్తుందో చూడాలి.

హీరోయిన్‌ కాక ముందు కీలక పాత్రల్లో చేసింది అని చెప్పాం కదా.. ఆ సినిమాలు ఇవీ.. ‘ప్రేమదేశం’, ‘వాలిమై’, ‘వరుడు కావలెను’, ‘టక్‌ జగదీష్‌’, ‘రంగ్‌ దే’ సినిమాల్లో నటించింది. ఇక ‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’ సిరీస్‌ ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus