బ్యాక్ డోర్ సినిమాకు భారీ రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది: డైరెక్టర్ కర్రి బాలాజీ

నానాటికీ ట్రెండ్ మారుతూ వస్తోంది. ప్రేక్షకులు సినిమా చూసే దృక్కోణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కథల వేట కొనసాగిస్తున్నారు నేటితరం ఆడియన్స్. అదే ఇండస్ట్రీకి వస్తున్న నూతన దర్శకులకు వరంగా మారింది. దీంతో ఇదే బాటలో వెళ్తూ ఇండస్ట్రీకి పరిచయమైన కొత్త దర్శకులు ప్రయోగాత్మక కథలతో సక్సెస్ అవుతుండటం చూస్తున్నాం. అలాంటి దర్శకుల్లో ఒకరే కర్రి బాలాజీ. ‘బ్యాక్ డోర్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన తొలి సినిమాతోనే తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు. బులితెరపై ఎన్నో ప్రయోగాత్మక ప్రోగ్రామ్స్‌కి డైరెక్షన్ చేసిన బాలాజీ.. ఆ అనుభవాన్ని రంగరిస్తూ ‘బ్యాక్ డోర్’ అనే సీట్ ఎడ్జ్ మూవీని ప్రేక్షకుల ముందుంచి సూపర్ సక్సెస్ ఖాతాలో వేసుకున్నారు.

పూర్ణ ప్రధాన పాత్రలో తేజ త్రిపురాన హీరోగా నటించిన బ్యాక్ డోర్ చిత్రాన్ని కెమెరాలో డైరెక్టర్ కర్రి బాలాజీ బంధించిన తీరు విమర్శకుల ప్రశంసలందుకుంటోంది. యూత్‌పుల్‌ అంశాలతో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాతో డిఫరెంట్ సబ్జెక్ట్ టచ్ చేసి ప్రేక్షకుల చేత భేష్ అనిపించుకుంది బ్యాక్ డోర్ టీమ్. కేవలం రెండే రెండు క్యారెక్టర్స్‌తో ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తూ సరికొత్త కథను ఆవిష్కరించారు. పెళ్లయ్యాక మహిళ తన మనసుకు, ఆలోచనలకు ఎలాంటి హద్దులు గీసుకోవాలో తెలియజేసే మంచి సందేశాన్నిచ్చి సూపర్ సక్సెస్ అయ్యారు.

యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా ఈ బ్యాక్ డోర్ సినిమా రూపొందింది. సగటు ప్రేక్షకుడికి ఏ మాత్రం బోర్ కొట్టించకుండా సినిమా మొత్తం నడిపించిన ఘటన డైరెక్టర్ కర్రి బాలాజీ సొంతం. పూర్ణ, తేజ త్రిపురాన రోల్స్ ఎలివేట్ చేస్తూ ప్రతి నిమిషం ఉత్కంఠ రేపే సన్నివేశాలతో కట్టిపడేసి పలువురి ప్రశంసలందుకున్నారు. తొలి సినిమాతోనే ఇంతలా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో కర్రి బాలాజీ సూపర్ సక్సెస్ అయ్యారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గ్లామర్, రొమాన్స్ అంశాల మధ్య సామాజిక సందేశంతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది.

కాగా, బుల్లితెరపై సక్సెస్‌ఫుల్ ప్రోగ్రామ్స్ చేయడమే గాక షార్ట్ ఫిలింతో నంది అవార్డు సొంతం చేసుకున్న డైరెక్టర్ కర్రి బాలాజీ మాట్లాడుతూ.. ”తొలి తోనే ప్రేక్షకుల ఆదరణ పొందటం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సక్సెస్ అందించిన ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. నా ప్రతి సినిమాను కూడా డిఫరెంట్ జోనర్‌లో రూపొందిస్తాను. ఈ క్రమంలోనే నా తదుపరి సినిమాను ఆనంద భైరవి పేరుతో మీ ముందుకు తీసుకురానున్నాను. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో అంజలి, రాయ్ లక్ష్మి, మురళి శర్మ, రాశి సహా పలువురు ఫేమస్ యాక్టర్స్ భాగమవుతున్నారు. మణిశర్మ బాణీలు కడుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటిస్తాం. ముందు ముందు ఇలాగే ప్రేక్షకులు నన్ను ఆదరించాలని కోరుకుంటున్నా” అన్నారు.

ఇక ‘బ్యాక్ డోర్’ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాకు బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. ప్రణవ్ సంగీతం అందించారు.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus