Poorna Husband: అబ్బో.. పూర్ణకి కాబోయే భర్త మామూలు సెలబ్రిటీ కాదు..!

‘శ్రీమహాలక్ష్మీ’ ,’సీమ టపాకాయ్’, ‘అవును’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళీ ముద్దుగుమ్మ పూర్ణ.. ఎక్కువ కాలం హీరోయిన్ గా రాణించలేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడింది.’సిల్లీ ఫెలోస్’ ‘అఖండ’ ‘దృశ్యం 2’ వంటి చిత్రాల్లో ఈమె కీలక పాత్రలు పోషించింది. ప్రస్తుతం బుల్లితెర పై బిజీ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న పూర్ణ నిన్న సడెన్ గా పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. అంతేకాదు తనకు కాబోయే భర్త ఫోటోని కూడా పోస్ట్ చేసింది. దీంతో ఈ వార్త వైరల్ గా మారింది.

పూర్ణ చేసుకోబోయే వ్యక్తి పేరు షానిద్‌ అసిఫ్‌ అలీ. యూఏఈ కి చెందిన బిజినెస్మెన్. ఈయన కూడా కేరళకి చెందిన వ్యక్తే..! జేబీఎస్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలకు ఇతను సీఈఓ, ఫౌండర్‌. జమా అల్మెహరి అనే సంస్థని కూడా ఈయన సైతం స్థాపించడం జరిగింది.ఈయన ఆఫీస్ ప్రారంభించడానికి కావలసిన సర్వీసులను ప్రొవైడ్ చేస్తూ ఉంటారు.అంతేకాకుండా సెలబ్రిటీలకు యూఏఈ వీసాలను కూడా ఏర్పాటు చేస్తుంటారు. వీసా ప్రాసెసింగ్‌ అలాగే ఫ్లైట్‌ టికెటింగ్‌ వంటి పలు సర్వీసులను కూడా షానిద్‌ కంపెనీ ఏర్పాటు చేస్తూ ఉంటుంది.

ఇండియాలో ఉన్న చాలా మంది సెలబ్రిటీలకు ఆయన యూఎఈ వీసాలను ఏర్పాటు చేశారు. కాజల్‌, ప్రియమణి, ప్రణిత, ఆండ్రియా, లక్ష్మీ, విజయ్‌ సేతుపతి, స్వేతా మీనన్‌, నాజర్‌, అజారుద్దీన్‌ వంటి సెలబ్రిటీలకు ఈయన వీసాలు అందించడం జరిగింది. ఈయన కూడా ఓ సెలబ్రిటీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటారు. ముస్లీం మత పెద్దలతో కూడా ఈయనకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి.

చాలా కాలంగా ఈయనకి పూర్ణ ఫ్యామిలీతో పరిచయం ఉంది.ఇద్దరూ పలు వేడుకల్లో పాల్గొన్న సందర్భాలు కూడా ఉన్నాయి.అయితే పెద్దల సమక్షంలో వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు స్పష్టమవుతుంది. నిజానికి పూర్ణ కూడా ముస్లిం కుటుంబానికి చెందిన అమ్మాయే అన్న సంగతి తెలిసిందే. ఆమె అసలు పేరు షామ్నా కాసిమ్. త్వరలోనే వీరి డేట్ ఫిక్స్ చేయనున్నారు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus