Coolie: ‘కూలీ’ సినిమా ఎలా సెట్‌ అయిందో తెలుసా? ఆయనే లేకుంటే..

‘కూలీ’.. ఇది సాధారణ సినిమా కాదు. రిజల్ట్‌ గురించో, వసూళ్ల గురించో మేం ఈ విషయం చెప్పడం లేదు. కాంబినేషన్‌ నేపథ్యంలోనే ఈ మాట చెప్పాం. రజనీకాంత్‌ – లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌ ఎవరూ ఊహించనిది, ఒకవేళ ఊహించుకొని ఉంటే అదొక అద్భుతం. ఎందుకు ఏంటి అనేది తర్వాత మాట్లాడదాం. ఈ సినిమాలో నటించిన నటులు మామూలుగా వారు కాదు. నాగార్జున, ఆమిర్‌ ఖాన్‌, ఉపేంద్ర, శ్రుతి హాసన్‌.. పెద్ద స్టార్‌ కాస్టే ఉంది. అయితే దీనంతటికి కారణం ఒకే ఒక్కడు అని నమ్ముతారా? కానీ ఒక్కడే.. ఆ ఒక్కడు ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌.

Coolie

‘ఖైదీ’ సినిమా నుండే లోకేష్ కనగరాజ్‌కు రజనీకాంత్‌తో సినిమా చేయాలనే లక్ష్యం ఉండేదట. మూడేళ్లు చాలా రకాలుగా ప్రయత్నాలు చేశాడట. అలా ఓసార ఒక లైన్ వినిపించాడట. అయితే ఆ లైన్‌ పూర్తి కథగా తయారవ్వకుండానే కమల్ హాసన్‌ ‘విక్రమ్’ సినిమా ఓకే అవ్వడంతో అటువైపు వెళ్లిపోయారు. ఆ తర్వాత ‘మాస్టర్‌’ కాంబినేషన్‌ను రిపీట్‌ చేస్తూ ‘లియో’ చేశారు. ఆ తర్వాత ఓసారి అనిరుధ్‌తో మాట్లాడుతూ రజనీకాంత్‌తో పెండింగ్ ఉండిపోయిన సినిమా గురించి మనసులో మాట చెప్పారట.

తలైవా కోసం రాసుకున్న కథలో కొంత భాగం కూడా అనిరుధ్‌కి వినిపించారట. ఆ లైన్‌ వినగానే ఇంప్రెస్ అయిన అనిరుధ్ వెంటనే రజనీకాంత్‌ దగ్గరకు విషయాన్ని తీసుకెళ్లారట. ఆ తర్వాత ఇద్దరికీ మీటింగ్ జరిగేలా చూశారట. అప్పుడు కథ విన్న రజనీకాంత్‌ ఓకే చెప్పి ‘కూలీ’ సినిమాను పట్టాలెక్కించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. అప్పుడు అనిరుధ్‌ దగ్గర లోకేశ్‌ ప్రస్తావించకపోయినా.. కథ విని ఆయన ఊరుకొని ఉన్న ఇప్పుడు మనం ‘కూలీ’ మేనియాను చూడలేకపోయేవాళ్లం. ఇక ఈ సినిమా రేపే విడుదలవుతోంది. ‘వార్‌ 2’ సినిమా జోరును బలంగా ఢీకొంటోంది. మరి ఫలితం విషయంలో ఎలా ఉంటుంది అనేది చూడాల్సి ఉంది.

నాగ శౌర్య సినిమాని రివర్స్ చేసి నారా రోహిత్ సినిమా తీశారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus