నారా రోహిత్ మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యాడు. ‘ప్రతినిధి 2’ తో రీ ఎంట్రీ ఇచ్చిన అతను.. తర్వాత ‘భైరవం’ అనే మల్టీస్టారర్ సినిమాలో ఓ హీరోగా నటించాడు. సినిమాలో అత్యంత కీలక పాత్ర అది. నారా రోహిత్ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. దీని తర్వాత నారా రోహిత్ ‘సుందరకాండ’ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఏడాది క్రితమే టీజర్ రిలీజ్ చేశారు.
కానీ సినిమా ఎందుకో వెంటనే రిలీజ్ కాలేదు. ఓటీటీ డీల్ కోసం ఆగినట్టు ఉంది అనే కామెంట్స్ వినిపించాయి. అయితే ఇటీవల ‘సుందరకాండ’ డిజిటల్ అండ్ శాటిలైట్ డీల్స్ క్లోజ్ అయినట్టు తెలుస్తోంది. అందుకే రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఆగస్టు 27న ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఇదిలా ఉండగా.. ట్రైలర్లో కథ పై ఎటువంటి హింట్ ఇవ్వలేదు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం.. ‘సుందరకాండ’ సినిమా కథ 2014 లో వచ్చిన నాగ శౌర్య ‘దిక్కులు చూడకు రామయ్య’ కి సిమిలర్ గా ఉంటుందని తెలుస్తుంది. అందులో తండ్రీ కొడుకులు కలిసి ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. ఆ తర్వాత చోటు చేసుకునే సంఘటనలు ఎంటర్టైనింగ్ గా అనిపిస్తాయి.
ఇక ‘సుందరకాండ’ కూడా ఆల్మోస్ట్ అలాంటి కథే అని తెలుస్తుంది. అయితే ఈ కథలో హీరో తెలియకుండా తల్లి కూతుర్లను ప్రేమిస్తాడట. ఈ విషయం తెలిశాక వచ్చే సీన్లన్నీ చాలా ఫన్నీగా ఉంటాయని.. కచ్చితంగా ఈ సినిమా ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తుందని చెబుతున్నారు. చూడాలి మరి.