ప్రభాస్ చేతి నుండి చేజారిన ధూమ్ 4

  • February 5, 2020 / 05:06 PM IST

బాలీవుడ్ లో ధూమ్ సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజ్. 2004లో జాన్ అబ్రహాం, అభిషేక్ బచ్చన్ హీరోలుగా మొదలైన ఈ సిరీస్ కి కొనసాగింపుగా మరో రెండు సిరీస్ లు వచ్చాయి. ఫస్ట్ పార్ట్ వచ్చిన రెండేళ్లకు 2006లో హ్రితిక్ రోషన్, అభిషేక్ బచ్చన్ మరియు ఐశ్వర్య రాయ్ ప్రధాన పాత్రలలో ధూమ్ 2 వచ్చింది. ఈ మూవీ మొదటి భాగానికి మించిన విజయాన్ని అందుకుంది. సూపర్ దొంగగా హృతిక్ నటన, హ్రితిక్ మరియు అభిషేక్ మధ్య యాక్షన్ సన్నివేశాలు సినిమాకి ప్రధానంగా నిలిచాయి. ఇక బాలీవుడ్ సక్సెస్ ఫుల్ హీరో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో ధూమ్ 3 వచ్చింది. మొదటి రెండు భాగాలకు సంజయ్ గాద్వి దర్శకత్వం వహించగా మూడో భాగానికి విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించారు. ధూమ్, ధూమ్ 2 కి విజయ్ కృష్ణ పనిచేశారు.

ధూమ్ క్రేజీ సిరీస్ అయిన నేపథ్యంలో నాలుగో భాగంలో హీరోగా ఎవరు నటించనున్నారు అనే దానిపై ఆసక్తినెలకొని వుంది. ధూమ్ 4 లో ప్రభాస్ నటిస్తున్నాడంటూ గతంలో వార్తలు వచ్చాయి. ప్రభాస్ కి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం కలదని అందరూ భావించారు. ఐతే తాజా సమాచారం ప్రకారం ధూమ్ 4 నందు బాలీవుడ్ లో సూపర్ ఫార్మ్ లో ఉన్న అక్షయ్ కుమార్ నటించనున్నారట. దీనిపై ఇప్పటికే నిర్మాతలు చర్చలు కూడా జరిపారని వార్తలు వస్తున్నాయి. దీనితో ప్రభాస్ ని ధూమ్ సిరీస్ లో చూడాలనుకున్న ఫ్యాన్స్ ఆశలకు గండికొట్టినట్లు అయ్యింది. బాలీవుడ్ ప్రతిష్టాత్మక ధూమ్ సిరీస్ లో నటించడం గొప్ప విషయమనే చెప్పాలి. ఇప్పటికే బాహుబలి, సాహో చిత్రాలలో తన ఇమేజ్ పెంచుకున్న ప్రభాస్ ధూమ్ 4 చేసినట్లయితే ఆయన రేంజ్ అక్కడ మరో స్థాయికి వెళ్ళేది.

Most Recommended Video

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus