కొంచెం ప్రేమ.. కొంచెం హాస్యం.. పక్కింటి కుర్రోడి పాత్ర.. నేచురల్ నానికి ఇవి ఉంటేచాలు. సినిమాని సులువుగా విజయ తీరం చేర్చేస్తారు. ఆలా వరుసగా ఏడు విజయాలను కైవసం చేసుకొని మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నారు. అల్లు అర్జున్.. కథ పాతదే అయినా కాస్త స్టైల్.. ఇంకాస్త స్టెప్పులు.. అక్కడక్కడా అదిరే యాక్షన్ సీన్స్.. సహాయంతో హిట్ ని బ్యాక్ ప్యాకెట్ పెట్టుకొని తిరుగుతున్నారు. తనకి ఎలాగూ కామెడీ టైమింగ్ పై పట్టుంది. బోర్ కొడుతుంది అనే సమయంలో నాలుగు పంచ్ లతో సినిమా బోల్తా కొట్టకుండా కాపాడుకునేవారు. ఇలా సేఫ్ గా ప్రయాణిస్తున్న వీరిద్దరూ ఒకేసారి బోల్తా కొట్టారు.
సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు, దువ్వాడ జగన్నాథం.. ఈ మూడు సినిమాలు కొంచెం నెగటివ్ టాక్ తెచుకున్నప్పటికీ మంచి కలక్షన్స్ రాబట్టాయి. ఈ కలక్షన్స్ వెనుక బన్నీ హాస్యం దాగుందని చెప్పాలి. కథలో అక్కడక్కడా నవ్వులను పూయించి కాసులు కురిపించారు. ‘నా పేరు సూర్య’ లో మాత్రం అదే మిస్ అయింది. సినిమా మొత్తం సీరియస్‌గా సాగడంతో ఆకట్టుకోలేకపోయాడని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక నాని జెంటిల్ మ్యాన్, నిన్నుకోరి, ఎంసీఏ సినిమాలు కొంచెం సెంటిమెంట్ తో సరదాగా సాగిపోయి సక్సస్ అయ్యాయి. ఎంసిఎ చిత్రంతో మాస్ ప్రేక్షకులకు దగ్గరవ్వాలని ఆరాటపడ్డారు. కొంచెం దెబ్బతిన్నారు. అయినా జాగ్రత్త పడకుండా ‘కృష్ణార్జున యుద్దం’తో మళ్ళీ మాస్ ని మెప్పించాలని కష్టపడ్డారు. కుదరలేదు. సో ఇలాంటి చిన్న తప్పులు సరిద్దుకొని నాని, బన్నీ విజయాలను అందుకోవాలని అందరు కోరుకుంటోంది.