Mrunal Thakur: నిరాశ పరిచినందుకు క్షమించండి…బాద్ షా కామెంట్స్ వైరల్!

సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి నటి మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమాతోనే ఎంతో గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళ హిందీ భాష చిత్రాలలో కూడా అవకాశాలు అందుకొని కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే త్వరలోనే ఈమె హాయ్ నాన్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీ విడుదల కాబోతోంది.

ఇదిలా ఉండగా తాజాగా మృణాల్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి మనకు తెలిసిందే ఈమె ప్రముఖ బాలీవుడ్ సింగర్ బాద్ షా అనే వ్యక్తితో డేటింగ్ లో ఉన్నారా అంటూ పెద్ద ఎత్తున ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి మనకు తెలిసిందే. ఈయనతో కలిసి మృణాల్ చనువుగా ఉండడమే కాకుండా ఇద్దరు ఒకరి చేతులు మరొకరు పట్టుకొని ఫోటోలకు ఫోజులిస్తూ శిల్పా శెట్టి ఇంట దీపావళి సెలబ్రేషన్స్ లో సందడి చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మృణాల్ బాద్షా ప్రేమలో ఉన్నారా అంటూ సందేహాలను వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ వార్తలపై సింగర్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈయన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా పోస్ట్ చేస్తూ.. మిమ్మల్ని నిరాశపరిచినందుకు నన్ను క్షమించండి మీరు అనుకున్నట్టు ఏమీ లేదు అంటూ చెప్పుకోవచ్చారు.

ఇలా ఈయన మీరు అనుకున్నట్టు ఏమీ లేదు అని పోస్ట్ చేయడంతో తన గురించి నటి మృణాల్ గురించి వస్తున్నటువంటి వార్తల పైన ఈయన స్పందించి క్లారిటీ ఇచ్చారని తెలుస్తుంది. ఇక ఈ మధ్యకాలంలో మృణాల్ తన ప్రేమ పెళ్లి వార్తల ద్వారా సంచలనంగా మారారు ఇదివరకే ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీకి కోడలు కాబోతుంది అనే వార్త వైరల్ గా మారడంతో ఈ వార్తలపై స్పందించి ఈమె (Mrunal Thakur) క్లారిటీ ఇచ్చారు. తాజాగా మరోసారి డేటింగ్ రూమర్స్ కూడా వెలుగులోకి రావడం గమనార్హం.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus