బాహుబలి బిగినింగ్ విడుదలయిన తర్వాత అవార్డులు, రివార్డులు అందుకుంది. ఎస్.ఎస్. రాజమౌళి, ప్రభాస్ కలయికలో వచ్చిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులను ఆకట్టుకుంది. దీనికి కొనసాగింపుగా వస్తున్న బాహుబలి కంక్లూజన్ విడుదలకు ముందే అరుదైన గౌరవాన్ని పొందింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోన్న ఈ ఫిల్మ్ ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28 న రిలీజ్ కానుంది. విడుదలకు ఒక రోజు ముందే ఈ చిత్రాన్ని లండన్లో ప్రదర్శించనున్నారు. భారతీయ 70 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని లండన్లో ఏప్రిల్ లో వేడుకను నిర్వహించనున్నారు.
ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా బాహుబలి కంక్లూజన్ సినిమాని ఏప్రిల్ 27 న ప్రదర్శించాలని బ్రిటిష్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఇందుకు నిర్మాతలు ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ సంతోషంగా అంగీకరించారు. ఒక తెలుగు చిత్రం లండన్ వేడుకల్లో ప్రదర్శితం కావడం ఇదే తొలిసారి కావడంతో రాజమౌళి బృందం, ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.