వైరల్ అవుతున్న ‘బాల రామాయణం’ నటుల ఫోటోలు..!

చిన రామయ్య అదేనండీ మన జూనియర్ ఎన్టీఆర్ వెండితెరకు పరిచయమైంది ‘బాల రామాయణం’ చిత్రంతో అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. 1996 ఏప్రిల్ 14 న ఈ చిత్రం విడుదలైన ఈరోజుతో 25 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ‘శబ్దాలయ థియేటర్స్’ బ్యానర్ పై ఎం.ఎస్.రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని గుణ శేఖర్ డైరెక్ట్ చేసారు. మైతొలాజికల్ చిత్రాన్ని అప్పటి జనరేషన్ చిన్న పిల్లలు అందరికీ అర్ధం కావాలి అనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే కేవలం వారికి మాత్రమే కాదు కుటుంబంలో అందరికీ కనెక్ట్ అయ్యింది. హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఈ చిత్రం దుమ్ము రేపింది. ఇప్పటి ప్రేక్షకులు కూడా ‘బాల రామాయణం’ గురించి మాట్లాడుకునేలా ఎంతో కలర్ ఫుల్ గా .. రిచ్ గా కనబడేలా .. ఆ చిత్రాన్ని తీసారు అంటే.. అది కూడా లో బడ్జెట్ లో అంటే మాటలు కాదు. ఇప్పటికీ ఆ చిత్రం ఓ ట్రెండ్ సెటర్ అనే చెప్పాలి.

మరి ఆ చిత్రంలో నటించిన మన జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు పెద్ద స్టార్ అయిపోయి.. ఏకంగా ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి భారీ సినిమాలో నటించేస్తున్నాడు. ఇప్పటికే అతను 29 సినిమాల వరకూ చేసేసాడు. ఇద్దరు పిల్లల తండ్రి అయిపోయాడు. మరి మిగిలిన నటీ నటులు ఎలా ఉన్నారు…. ఓ లుక్ ఏద్దాం రండి :

1) రాముడు పాత్ర చేసిన ఎన్టీఆర్

2) సీత పాత్ర చేసిన స్మిత మాధవ్

3) లక్ష్మణుడు పాత్ర చేసిన నారాయణం నిఖిల్

4) హనుమంతుడు పాత్ర చేసిన అర్జున్ గంగాధర్

5) రావణుడు పాత్ర చేసిన స్వాతి బాలినేని

6) శబరి పాత్ర చేసిన సునైనా

7) కుంభ కర్ణుడు పాత్ర చేసిన అమ్జాద్ ఖాన్

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus