‘దిల్రాజు ప్రొడక్షన్స్’ బ్యానర్ పై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన చిత్రం ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ‘జబర్దస్త్’ కమెడియన్ వేణు టిల్లు అలియాస్ వేణు ఎల్దండి దర్శకుడు. మార్చి 3న రిలీజ్ అయిన ఈ చిత్రం ఫుల్ పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ ఎమోషనల్ గా కనెక్ట్ అయినట్టు చెప్పుకొచ్చారు.
నిజానికి ఈ సినిమా మౌత్ టాక్ తో కంటే కూడా కాంట్రవర్సీతోనే ఎక్కువ పాపులర్ అయ్యిందని చెప్పాలి. ఈ కథ నాది అంటూ ఓ జర్నలిస్ట్ మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేయడం.. ఆ తర్వాత దర్శకుడు వేణు కూడా మీడియా ముందుకు వచ్చి అదంతా అబద్ధం అని చెప్పడంతో ‘బలగం’ ఎక్కువగా వార్తల్లో నిలిచింది. దీంతో ఈ మూవీకి ప్రమోషన్ బాగా జరిగినట్లు అయ్యింది.
ఈ క్రమంలో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ వీక్ డేస్ లో కూడా స్టడీగా రాణించింది. మొదటి రోజు కంటే 7వ రోజు ఈ మూవీ ఎక్కువ కలెక్ట్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి.ఒకసారి ‘బలగం’ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం
1.95 cr
సీడెడ్
0.16 cr
ఆంధ్ర
0.68 cr
ఏపీ + తెలంగాణ
2.79 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
0.06 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
2.85 cr
‘బలగం’ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.1.2 కోట్లు కాగా.. మొదటి వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను సాధించిన ఈ మూవీ మొదటి వారం పూర్తయ్యేసరికి వరల్డ్ వైడ్ గా రూ.2.85 కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది. నైజాంలో ఈ మూవీ చాలా బాగా కలెక్ట్ చేస్తుంది.
ఇప్పటివరకు ఈ మూవీ రూ.1.65 కోట్ల ప్రాఫిట్స్ ను అందించి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ వీకెండ్ కు కూడా పెద్ద సినిమాలు లేవు కాబట్టి.. కొంతలో కొంత ‘బలగం’ క్యాష్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.