Balakrishna, Koratala Siva: మల్టీస్టారర్ ప్రాజెక్టు విషయంలో బాలయ్య డెసిషన్ మారిందా..!

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ చిత్రం ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆయన వరుసగా సక్సెస్ టూర్లు లేదా సెలబ్రేషన్స్ వంటి వాటిలో చురుగ్గా పాల్గొంటున్నారు. తాజాగా విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న బాలకృష్ణ అండ్ ‘అఖండ’ టీం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం మీడియాతో మాట్లాడిన బాలయ్య.. “అఖండ సినిమా అఖండమైన విజయం సాధించింది. ఈ సినిమా విజయంతో అమ్మవారిని దర్శించుకున్నాం.

సకుటుంబ సపరివార సమేతంగా అందరూ సినిమాకి వస్తుండడం సంతోషం.నందమూరి తారక రామారావు ఆనాడు భక్తిని కాపాడారు..ఇప్పుడు సనాతన ధ‌ర్మాన్ని కాపాడిన సినిమా ‘అఖండ’.సినిమాని ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకి హృదయపూర్వక కృతజ్ఞ‌తలు.ఏదైనా మంచి పని తలపెడితే విజయం తధ్యం.. అమ్మవారి అశీస్సులతో సినిమా దిగ్విజయంగా ప్రదర్శింపబడుతుంది.మంచి సినిమాను ప్రజలు ఆదరిస్తారని మరోసారి నిరూపించారు. టిక్కెట్ల విధానంపై గతంలో చర్చించుకున్నాం..ఏదైతే అదని సినిమా విడుదల చేసాం.సినిమా మంచిగా వచ్చిందని డేర్ స్టెప్ వేశాం కొంతమంది ఆగినా..

మేమెక్కడా వెనుకడుగు వేయలేదు.ప్రభుత్వం అప్పీల్ కు వెళ్తామంటున్నారు చూద్దాం.న్యాయ నిర్ణేత దేవుడే… దేవుడున్నాడు.మంచి కథ వస్తే మల్టీస్టారర్ సినిమా తీస్తాం” అంటూ బాలయ్య చెప్పుకొచ్చాడు. అయితే బాలయ్య కొరటాల శివ దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ చిత్రం చేయబోతున్నట్టు కొద్దిరోజులుగా కథనాలు వినిపిస్తున్నాయి.కొరటాల సన్నిహితులు ఇది నిజమే అని పరోక్షంగా స్పందించారు. మరో హీరోగా సాయి ధరమ్ తేజ్ పేరు వినిపించింది. దాదాపు ఈ ప్రాజెక్టు ఫైనల్ అయిపోయినట్టే..! కానీ బాలయ్య ‘మంచి కథ దొరికితే’ అని మళ్ళీ కామెంట్ చేయడంతో ఇండస్ట్రీ వర్గాల్లో మళ్ళీ కన్ఫ్యూజన్ మొదలైంది.

బహుశా బాలయ్య.. మర్చిపోయి ఉంటారు అని కొంతమంది అంటుంటే మరికొంతమంది ఎన్టీఆర్ తో కొరటాల శివ సినిమా పూర్తయ్యేవరకు ఈ ప్రాజెక్టు హోల్డ్ లో పడిందేమో.. అందుకే బాలయ్య ఇలా అని ఉంటారు అని మరికొంతమంది అంటున్నారు. ఇక పోతే బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్నాడు. అటు తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా సినిమా చేయడానికి రెడీ ఆవుతున్నాడు.

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!

Most Recommended Video

మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus