నందమూరి బాలకృష్ణ (Balakrishna) తనయుడు మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) టాలీవుడ్ ఎంట్రీ ఖరారు అయిపోయింది. ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా కోసం ప్రస్తుతం మోక్షు రెడీ అవుతున్నాడు. ఇటీవల ‘సింబా ఈజ్ కమింగ్’ అంటూ భారీ స్థాయిలో సినిమాను అనౌన్స్ చేసింది టీమ్. అయితే ఎప్పుడు ముహూర్తం, ఎప్పుడు షూటింగ్ అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ ఎదురుచూపులకు బాలయ్య ఫుల్‌స్టాప్ పెట్టేశారు. అవును, మోక్షు సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను ఇటీవల బాలయ్య చెప్పుకొచ్చారు.
దీంతో ఆ విషయాలు వైరల్‌గా మారాయి. చాలా మంది అనుకుంటున్నట్లుగానే ఈ సినిమా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగానే తెరకెక్కుతోంది. ఈ విషయాన్ని బాలయ్యే చెప్పుకొచ్చారు. ఐఫా అవార్డ్స్ కార్యక్రమానికిక హాజరైన బాలయ్య ఈ విషయాలను వివరించారు. ‘మీ వారసుడు సినిమా ఎప్పుడు మొదలు కాబోతుంది?’ అని బాలయ్యను అడగ్గా.. అని ప్రశ్నించగా… మోక్షజ్ఞ మొదటి సినిమాను డిసెంబరులో లాంచ్ చేస్తున్నాం అని బాలయ్య చెప్పుకొచ్చారు. అయితే ప్రశాంత్ వర్మ సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ లోనే ఈ ప్రాజెక్ట్ ఉండబోతుంది అని తెలుస్తోంది.
ఇండియన్ మైథాలజీలో ఉన్న పాత్రల ఆధారంగా ప్రశాంత్ ఓ కథ రాసుకున్నారట. అయితే ఏ పాత్ర అనేది సినిమా ప్రారంభించాక తెలుస్తుంది అంటున్నారు. ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. మోక్షజ్ఞ సోదరి, బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని నిర్మాతగా తెరకెక్కబోతోంది. ఇందులో హీరోయిన్ ఎవరు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు కానీ.. గతంలో శ్రీలీల (Sreeleela) అవ్వొచ్చు అని కొన్ని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఆమె అవుటాఫ్ ఫామ్‌లో ఉంది.
కాబట్టి కొత్త తెలుగమ్మాయిని ఎంపిక చేస్తారు అంటున్నారు. ఈ క్రమంలో కొంతమంది శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషి అయితే ఎలా ఉంటుంది అనే చర్చ కూడా పెడుతున్నారు. ఎన్టీఆర్ (Jr NTR) పక్కన జాన్వీ (Janhvi Kapoor) నటించేసింది కాబట్టి.. ఇక ఖుషి ఎంట్రీ ఒక్కటే మిగిలి ఉంది. చూద్దాం బాలయ్య మనసులో ఏముందో? ఎవరున్నారో?