Prakash Raj: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కొత్త ఆఫర్లకు సమస్య ఇదేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణమైన నటుడిగా ప్రకాష్ రాజ్ (Prakash Raj) తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు తన సక్సెస్ రేట్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. దేవర (Devara) సినిమాలో సింగప్ప అనే పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ తన నటనతో పాత్రకు ప్రాణం పోశారనే చెప్పాలి. అయితే ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాలంలో పలు వివాదాల ద్వారా కూడా వార్తల్లో నిలిచారనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ను (Pawan Kalyan) టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ కామెంట్లు చేసిన నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రకాష్ రాజ్ కు ఆఫర్లు రావడం సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Prakash Raj

వరుస వివాదాల వల్ల ప్రకాష్ రాజ్ తన కెరీర్ ను ప్రమాదంలోకి నెట్టేశారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ప్రకాష్ రాజ్ కు ఛాన్స్ ఇస్తే తమకే నష్టమని కొందరు దర్శకనిర్మాతలు ఫీలవుతున్నారు. లడ్డూ వివాదంలో ప్రకాష్ రాజ్ జోక్యం చేసుకోవడంతో పాటు తన ట్వీట్లతో పవన్ ను టార్గెట్ చేయడంతో ప్రకాష్ రాజ్ ను తీసుకోవాలని భావించే మేకర్స్ సైతం ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్థితి నెలకొంది.

గతంలో ప్రకాష్ రాజ్ కు అండగా నిలిచిన మెగా ఫ్యామిలీ మెగా కాంపౌండ్ కు దాదాపుగా దూరమైనట్టేనని చెప్పవచ్చు. ప్రతిభ ఉన్నా లౌక్యం లేకపోవడం వల్ల ప్రకాష్ రాజ్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గతంలో ప్రకాష్ రాజ్ పై పలు సందర్భాల్లో అనధికారికంగా బ్యాన్ విధించారు. వివాదాల వల్ల కొందరు దర్శకులు ప్రకాష్ రాజ్ కు ఇప్పటికే అవకాశాలు ఇవ్వడం లేదు.

ఇప్పటికైనా ప్రకాష్ రాజ్ లో మార్పు వస్తే మాత్రమే ఈ పరిస్థితి మారే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రకాష్ రాజ్ పారితోషికం ఒకింత భారీ స్థాయిలో ఉంది. ప్రకాష్ రాజ్ రెమ్యునరేషన్ కోటిన్నర రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

‘దేవర’ వాటర్‌ సీక్వెన్స్‌ గురించి చెప్పిన తారక్‌.. చాలా గ్రేట్‌ అంటూ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus