ఒకే కధపై ఇద్దరూ కన్నేశారు!!!

టాలీవుడ్ లో టాప్ హీరోలు ఎవరు అంటే వరుస క్రమంలో ముందుగా చెప్పే మాట మెగాస్టార్ చిరంజీవి, నట సింహం నందమూరి బాలకృష్ణ. అయితే అదే క్రమంలో చిరు పొలిటికల్ టచ్ పుణ్యమా అని ఆయన సినిమాలకు దూరమయ్యి, అక్కడ కాస్త బెడిసి కొట్టడంతో మళ్లీ సినిమాలే ఆధారంగా తన ప్రతిష్టాత్మక 150వ సినిమాను సొంత బ్యానర్ లో తెరకెక్కించారు. అయితే మరో పక్క తన 100వ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పాలి అన్న ఆశయంతో అమరావతి విసిస్టతను అందరికీ పంచాలి అన్న ఆలోచనతో బాలయ్య తన 100వ చిత్రంగా శాతవాహనుల రాజైన ,గౌతమీ పుత్రుడైన “శాతకర్ణి” కధతో “గౌతమీ పుత్ర శాతకర్ణి”గా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసేందుకు రెడీ అయ్యాడు…ఇక అదే క్రమంలో ఈ సంక్రాంతి బరిలో దిగనున్నాయి ఈ రెండు బడా సినిమాలు ఎలా అయినా హిట్ కొట్టాలి అన్న కసితొ బరిలో దిగుతున్న ఈ సంక్రాంతి పందెం కోళ్లలో ఎవరు హిట్ కొడతారో అన్న మాట పక్కన పెడితే….ఈ సమరం ఇక్కడితో ఆగిపోలేదు అన్న టాక్స్ బలంగా వినిపిస్తున్నాయి.

దానికి కారణం “ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి”కధ…విషయంలోకి వెళితే….ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే కథను పరచూరి బ్రదర్స్ ఎప్పుడో సిద్ధం చేసేశారు. చిరు రీఎంట్రీ కోసం కూడా ఈ కథను పరిశీలించారు. కానీ హిస్టారికల్ మూవీ కావడంతో రిస్క్ చేయకుండా.. మాస్ ఎంటర్టెయినర్ తో అలరించారని ఫిక్స్ అయ్యాడు మెగాస్టార్. అయితే ఇప్పుడు ఇదే కధను చేసేందుకు రెడీ అవుతున్నారు మెగాస్టార్ మరియు బాలయ్య….ఇప్పటివరకూ ఎవ్వరూ అధికారికంగా ఈ సినిమా చేస్తున్నట్లు అయితే ప్రకటించలేదు కానీ…ఎవరో ఒకరు ఈ సినిమా వచ్చే ఏడాది చేసేలా ఉన్నారు అన్న టాక్స్ అయితే బలంగా వినిపిస్తున్నాయి…చూద్దాం ఏం జరుగుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus