బాలకృష్ణ (Nandamuri Balakrishna) – విజయశాంతి (Vijayashanti) సూపర్ హిట్ పెయిర్. అప్పట్లో వీరి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ‘ముద్దుల మావయ్య’ ‘లారీ డ్రైవర్’ (Lorry Driver)‘రౌడీ ఇన్స్పెక్టర్’ (Rowdy Inspector) వంటి సూపర్ హిట్ సినిమాలు వీరి కాంబోలో వచ్చాయి. దాదాపు 17 సినిమాల్లో ఈ జంట కలిసి నటించడం జరిగింది. ఒకానొక టైంలో బాలయ్య, విజయశాంతి ప్రేమలో ఉన్నట్లు కూడా ప్రచారం జరిగింది. వీళ్ళు కచ్చితంగా పెళ్లి చేసుకుంటారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి.
అయితే బాలకృష్ణ తండ్రి నందమూరి తారక రామారావు (Sr NTR) వీరి పెళ్ళికి అనుమతి తెలుపనందున.. వీరు విడిపోయినట్టు కూడా చర్చలు నడిచాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది ఎవ్వరికీ తెలీదు. అయితే 1993 లో వచ్చిన ‘నిప్పురవ్వ’ (Nippu Ravva) తర్వాత బాలకృష్ణ సినిమాల్లో విజయశాంతి నటించింది లేదు. ఇటీవల వచ్చిన నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) సినిమా ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi) లో విజయశాంతి తల్లి పాత్ర చేయడం జరిగింది. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ.. విజయశాంతి ఈ సినిమాలో నటించి తమ అభిమానులను అలరించారు.
ఇప్పుడు మరో పెద్ద సినిమాలో కూడా ఆమె నటిస్తున్నట్టు చర్చ నడుస్తోంది.వివరాల్లోకి వెళితే.. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్లో ‘అఖండ’ కి (Akhanda) సీక్వెల్ గా తెరకెక్కుతున్న ‘అఖండ 2’ (Akhanda 2) లో విజయశాంతి నటిస్తున్నారట. దీనిపై చిత్ర బృందం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇందులో ఉన్న ఓ పవర్ఫుల్ రోల్ కి విజయశాంతి వంటి డైనమిక్ సీనియర్ హీరోయిన్ అవసరమని భావించి దర్శకుడు బోయపాటి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సీనియర్ హీరోయిన్లను.. రీ ఎంట్రీ ఇచ్చేలా చేయడం బోయపాటికి కొత్తేమీ కాదు. ‘జయ జానకి నాయక’ లో (Jaya Janaki Nayaka) వాణి విశ్వనాథ్ (Vani Viswanath), ‘వినయ విధేయ రామ’ (Vinaya Vidheya Rama) లో స్నేహ (Sneha) వంటి వారిని మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చేలా కన్విన్స్ చేసి తీసుకొచ్చాడు. ఇప్పుడు విజయశాంతి విషయంలో కూడా అదే సీన్ రిపీట్ అవుతుందేమో చూడాలి.