వెంకటేష్ (Venkatesh Daggubati), దగ్గుబాటి రానా (Rana Daggubati) కలిసి చేసిన ‘రానా నాయుడు’ (Rana Naidu) వెబ్ సిరీస్ 2023 స్టార్టింగ్లో వచ్చి ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. సుపర్న్ వెర్మ (Suparn Verma), కరణ్ అన్షుమన్ (Karan Anshuman) ఈ సిరీస్ ను డైరెక్ట్ చేశారు. ఈ సిరీస్ తెలుగు ప్రేక్షకులను షాక్ కు గురి చేసింది అనే చెప్పాలి. ఎందుకంటే వెంకటేష్ కి ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఉంది. అయితే ఈ సిరీస్ లో స్టార్టింగ్ సీన్ నుండి ఎండింగ్ వరకు బెడ్ రూమ్ సీన్స్, బూతులు వంటివి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి.
అవన్నీ తెలుగు ఆడియన్స్ కి షాకిచ్చాయి. రానాని కూడా ఇక్కడి వారంతా తిట్టిపోశారు. ఒకానొక టైంలో ఈ సిరీస్ ను ఓటీటీ నుండి డిలీట్ చేయడం కూడా జరిగింది. అలా వార్తల్లో నిలిచింది సిరీస్. దీనికి సీజన్ 2 (Rana Naidu 2) కూడా ఉంటుంది అని ముందుగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్ 13 నుండి సెకండ్ సీజన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా టీజర్ ని వదిలారు. 1:22 నిమిషాల నిడివి కలిగి ఉంది ఈ టీజర్.
కాంట్రోవర్సీకి భయపడో ఏమో కానీ.. ఇందులో ఎటువంటి వల్గారిటీకి తావివ్వకుండా టీజర్ ను కట్ చేశారు. నాగ వెళ్ళిపోయాక.. రానా ఫ్యామిలీ నార్మల్ అయ్యిందా? తర్వాత నాగ మళ్ళీ రానా లైఫ్లోకి ఎందుకు వచ్చాడు? ఈసారి అతని వల్ల రానా ఫ్యామిలీకి ఎదురైన సమస్యలు ఏంటి? వంటి ప్రశ్నలు రేకెత్తిస్తూ టీజర్ ను కట్ చేశారు. ఇందులో ఎక్కువగా యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. టీజర్ ను (Rana Naidu 2) మీరు కూడా ఓ లుక్కేయండి :