Balayya Babu,Anil Ravipudi: బాలయ్యను మళ్లీ ఆ విధంగా చూడబోతున్నామా?

బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. బాలయ్య కు కూతురిగా ఈ సినిమాలో శ్రీలీల నటిస్తారని వార్తలు వైరల్ అయినా ఆ వార్తలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ సినిమా కథకు సంబంధించి ఎన్నో కొత్త వార్తలు ప్రచారంలోకి వస్తున్నా తాజాగా ఈ సినిమా కథ ఇదేనంటూ ఒక కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న కథ ప్రకారం బాలయ్య గొడవల్లో పాల్గొని ఆవేశంలో చేసిన తప్పు వల్ల జైలు శిక్ష అనుభవిస్తాడు.

జైలు నుంచి హీరో రిలీజైన తర్వాత అతని లైఫ్ లో ఎన్నో మలుపులు చోటు చేసుకుంటాయని తెలుస్తోంది. ఆ సన్నివేశాలు చాలా కామెడీగా సాగుతాయని తెలుస్తోంది. సినిమాలో ఫుల్ ఎంటర్టైనింగ్ గా లవ్ ట్రాక్ ఉంటుందని ఆ లవ్ ట్రాక్ కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోందని సమాచారం. హీరో ఫ్లాష్ బ్యాక్ లో మాత్రం చాలా క్రూరంగా కనిపిస్తాడని తెలుస్తోంది. బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్లను గుర్తుకు తెచ్చేలా ఈ సినిమా ఉంటుందని బోగట్టా.

బాలయ్య ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుండగా వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. అనిల్ రావిపూడి తనదైన కామెడీ ఈ సినిమాలో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటారని సమాచారం అందుతోంది. భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. అనిల్ రావిపూడి ఇప్పటివరకు దర్శకత్వం వహించిన సినిమాలలో ఏ సినిమా కూడా ఫ్లాప్ కాలేదు.

బాలయ్య గోపీచంద్ మలినేని సినిమాను పూర్తి చేసి ఈ సినిమాపై దృష్టి పెట్టనున్నారు. బాలయ్య వరుసగా యంగ్ జనరేషన్ స్టార్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు. బాలయ్య ఈ సినిమా కోసం 12 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. బాలయ్య వేగంగా సినిమాలు చేయాలని భావిస్తున్నారని అదే సమయంలో కమర్షియల్ గా సక్సెస్ లను సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారని సమాచారం.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus