మెగా హీరోకు బాలయ్య సమస్య!!!

టాలీవుడ్ లో ఎవరెన్ని మాటలు మాట్లాడినా….మెగా ఫ్యామిలీ స్టామినా రేంజ్ వేరు అనే చెప్పాలి…అయితే అదే క్రమంలో మెగా శిబిరం నుంచి ఎంతమంది హీరోలు వచ్చినా….వాళ్ళందరినీ ఆహ్వానిస్తూ….తమ భుజాలపై మోస్తూ ఉన్నారు మెగా అభిమానులు….అయితే అదే క్రమంలో….టాలీవుడ్ కు పరిచయం అయిన హీరో సాయి ధర్మ తేజ…వరుస సినిమాలతో దూసుకొస్తున్న సాయి ధర్మ తేజ…తాజాగా విన్నర్ గా మన ముందుకు రానున్నాడు…..అయితే ఈ సినిమా పై ఎన్నో అసలు పెట్టుకున్న సాయి….తన తదుపరి సినిమాను మాస్ సినిమాలకు చిరునామాగా ఉండే వినాయక్ తో చేసి తాను కూడా 40 కోట్ల కలక్షన్స్ హీరోగా మారుదాం అని ఎన్ని కలలు కన్నాడు…అదే క్రమంలో దీనికి సంబంధించి వినాయక్ సాయిధరమ్ తేజ్ ల మధ్య ఒకప్రాధమిక అవగాహన కూడ వచ్చింది అన్నవార్తలు ఇప్పటికే బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు సాయి కలలు అన్నీ కల్లలుగా మారిపోతున్నాయి….దాని కారణం నందమూరి నట సింహం బాలయ్య… విషయంలోకి వెళితే…దర్శకుడు వినాయక్ కు ‘ఖైదీ నెంబర్ 150’ లాంటి భారీసినిమాను తీసినతరువాత ఒకచిన్న హీరోతో కాకుండా ఒకటాప్ హీరోతో సినిమా తీయాలి అన్న ఆలోచనలో ఉన్నట్లు టాక్.

దీనికితోడు ‘ఖైదీ’ 100 కోట్ల సినిమాగా మారినా ఆక్రెడిట్ అంతా చిరంజీవికే వెళ్లిపోయి వినాయక్ కు ఏమాత్రం ఆక్రెడిట్ చెందకపోవడంతో వినాయక్ బయటకు చెప్పుకోలేని షాక్ లో ఉన్నట్లు టాక్. ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో ‘ఖైదీ’ తరువాత తాను ఒక బడా హీరోతో సినిమా చెయ్యాలి అని ఆలోచిస్తున్నట్లు టాక్. ఇదిలా ఉంటే ఈపరిస్థుతుల నేపధ్యంలో వినాయక్ ఈమధ్య బాలకృష్ణను కలిసి ఒక పవర్ ఫుల్ సబ్జెక్ట్ ను వినిపించినట్లు టాక్. ఈస్టోరీ లైన్ కు ముచ్చట పడ్డ బాలకృష్ణ దానిని బాగా డెవలప్ చేసి తన వద్దకు తీసుకు రావలసిందిగా కోరినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఈమూవీని బెల్లంకొండ సురేష్ నిర్మించడానికి ముందుకు వస్తున్నట్లు సమాచారం. చారిత్రాత్మక ‘శాతకర్ణి’ విజయం తరువాత బాలకృష్ణ-వినాయక్-బెల్లంకొండ కాంబినేషన్ నిజంగా సెట్ అయితే మరో 100 కోట్ల సినిమా కోసం రంగం సిద్ధం అవుతున్నట్లు అనుకోవాలి. అదే జరిగితే…మాతో ఇండస్ట్రీ హిట్ కు పునాది పడినట్లే….చూద్దాం ఏం జరుగుతుందో…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus