Balakrishna: ”కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది”

నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సక్సెస్‌ఫుల్ కాంబోలో రాబోతున్న సినిమా BB3. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా మొదలుపెట్టి చాలా కాలం అవుతున్నా.. సినిమా టైటిల్ ను రివీల్ చేయలేదు. ఈ క్రమంలో టైటిల్స్ గా చాలా పేర్లు వార్తల్లో వినిపించాయి. ఫైనల్ గా ఎవరూ ఊహించని విధంగా ‘అఖండ’ అనే టైటిల్ పెట్టి ఆశ్చర్యపరిచాడు దర్శకుడు బోయపాటి. ఈరోజు ఉగాది సందర్భంగా సినిమా టైటిల్ తో పాటు చిన్నపాటి టీజర్ ను వదిలాడు.

భారీ శివుడి విగ్రహం.. దాని ముందు అఘోరా గెటప్ లో కనిపించే బాలయ్య విజువల్స్ ఆకట్టుకున్నాయి. నేల మీద నుండి త్రిశూలం గాల్లోకి లేపే సీన్ టెరిఫిక్ గా అనిపిస్తుంది. అదే త్రిశూలంతో ఫైట్ చేసే సన్నివేశాలను చూపించారు. ”హరహర మహాదేవ.. శంభో శంకర.. కాలు దువ్వే నందు ముందు రంగు మార్చిన పంది.. కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది” అంటూ బాలయ్య త్రిశూలం పట్టుకొని చెప్పే డైలాగ్ టీజర్ కి హైలైట్ గా నిలిచింది. తమన్ అందించిన నేపధ్య సంగీతం టీజర్ ని మరింత ఎలివేట్ చేసి చూపించింది.

ఈ చిత్రంలో బాలకృష్ణ మరోసారి డ్యూయల్ రోల్ పోషిస్తుండటం విశేషం. అఘోరాగా, అలాగే కలెక్టర్‌గా రెండు బలమైన పాత్రల్లో ఆయన కనిపించబోతున్నారట. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ ‌గా నటిస్తోంది. పాత్రలో నటుడు శ్రీకాంత్ నటిస్తున్నాడు. ద్వారక క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ముందుగా సినిమాను మే 28న విడుదల చేస్తామని ప్రకటించారు. మరి సినిమా అనుకున్న సమయానికి వస్తుందో లేదో చూడాలి!


‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus