Balakrishna: ఆ షరతుకు అంగీకరించిన బాలకృష్ణ!

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ సినీ కెరీర్ లో ఆదిత్య 369 సినిమా ప్రత్యేకమనే సంగతి తెలిసిందే. టైమ్ ట్రావెల్ ఫిక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా గురించి బాలకృష్ణ మాట్లాడుతూ అదిత్య 369 తరహా సినిమా మళ్లీ రాలేదని అన్నారు. ఈ మూవీ కొరకు ఎన్నో ప్రయోగాలు చేశామని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. ఈ సినిమా విడుదలై 30 సంవత్సరాలు కావడంతో ఈ సినిమాకు సంబంధించిన కీలక విషయాలను బాలయ్య అభిమానులతో పంచుకున్నారు.

ఎన్నిసార్లు చూసినా ఆదిత్య 369 మూవీ అద్భుతం అని అనిపిస్తుందని అమర గాయకుడు ఎస్పీ బాలు ఈ సినిమా కార్యరూపం దాల్చడంలో కీలక పాత్ర పోషించారని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. శ్రీకృష్ణదేవరాయలు పాత్ర ఈ సినిమాకు గుండెకాయ అని ఈ సినిమాలో నటించడం తన పూర్వజన్మ సుకృతమని బాలకృష్ణ వెల్లడించారు. అయితే ఎస్పీ బాలు బాలయ్య శ్రీ కృష్ణదేవరాయలు పాత్ర చేస్తేనే ఈ సినిమా చేయాలని సింగీతం శ్రీనివాసరావుకు షరతు పెట్టారు. ఆ షరతు గురించి తెలిసి బాలయ్య అంగీకరించడంతో ఈ సినిమా పట్టాలెక్కింది.

నిర్మాతకు ప్యాషన్, దర్శకునికి ధైర్యం, హీరోకు ప్యాషన్ ధైర్యం ఉంటే మాత్రమే ఇలాంటి సినిమాలను తెరకెక్కించడం సాధ్యమవుతుందని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞతో ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కించాలని భావిస్తున్నారు. అయితే ఈ సీక్వెల్ ఎప్పుడు ప్రారంభమవుతుందో చూడాల్సి ఉంది. బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన అఖండ వినాయక చవితికి రిలీజ్ కానుందని వార్తలు వస్తున్నాయి.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus