Akhanda: అఖండ అలాంటి సునామీ సృష్టించిందన్న బాలయ్య!

స్టార్ హీరో బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా తెరకెక్కితే ఆ సినిమా హిట్టేనని ప్రేక్షకులు భావిస్తారు. ఇప్పటివరకు ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలేవీ ప్రేక్షకులను నిరాశపరచలేదు. ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఘనవిజయం సాధించాయి. తాజాగా ఏపీలోని కర్నూలులో అఖండ మూవీ కృతజ్ఞత సభ జరిగింది. మంచి సినిమా చేయాలనే సంకల్పంతో అఖండ సినిమాను మొదలుపెట్టామని ఈ సినిమాతో మంచి సందేశం ఇచ్చామని బాలయ్య అన్నారు.

Click Here To Watch Now

సినిమా రంగాన్ని కూడా పరిశ్రమగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరతామని బాలయ్య చెప్పుకొచ్చారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి అఖండ మూవీ దిక్సూచిలా నిలిచిందని అఖండ మూవీ తెలుగు సంప్రదాయాన్ని ఇమడింపజేసిన సినిమా అని బాలయ్య పేర్కొన్నారు. మేము డబ్బును దృష్టిలో ఉంచుకుని సినిమా తీయమని బాలయ్య తెలిపారు. కట్టే, కొట్టె, తెచ్చె అనే మాటలతోనే సినిమా చేస్తామని బాలయ్య పేర్కొన్నారు. కర్నూలులోని మూడు థియేటర్లలో చిలకలూరిపేటలోని ఒక థియేటర్ లో అఖండ 100 రోజుల పాటు ప్రదర్శించబడటం సంతోషాన్ని కలిగించిందని బాలయ్య చెప్పుకొచ్చారు.

మాకు మేమే పోటీ అని చరిత్ర సృష్టించాలన్నా మేమే చరిత్రను తిరగరాయాలన్నా మేమే అంటూ బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పడం గమనార్హం. అఖండ సినిమా విడుదలైతే అమెరికాలో స్పీకర్లు కూడా బద్దలయ్యాయని బాలయ్య పేర్కొన్నారు. అఖండ మూవీ అలాంటి సునామీని సృష్టించిందని బాలయ్య కామెంట్లు చేశారు. అఖండ మూవీలో నటించిన నటీనటులకు బాలయ్య అభినందనలు తెలిపారు. అఖండ మూవీ షూటింగ్ లో బిజీగా ఉండి కరోనా ఉందనే విషయాన్ని కూడా మరిచిపోయామని ఆయన చెప్పుకొచ్చారు.

స్టార్ హీరో బాలకృష్ణ స్పీచ్ తెగ వైరల్ అవుతోంది. బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో అతి త్వరలోనే మరో సినిమా తెరకెక్కే ఛాన్స్ ఉందని సమాచారం. ఎలక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కవచ్చని తెలుస్తోంది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus