హీరోలు తమ సొంత ప్రొడక్షన్ బ్యానర్లు కలిగి ఉండడం అనేది సర్వసాధారణం. నందమూరి కుటుంబంలో ఆల్రెడీ అయిదారు ప్రొడక్షన్ బ్యానర్లు వున్నాయి. నందమూరి బాలకృష్ణకి (Balakrishna) “ఎన్.బి.కె ఫిల్మ్స్”, కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కి “ఎన్టీఆర్ ఆర్ట్స్”, నందమూరి రామకృష్ణకి (Nandamuri Ramakrishna) “రామకృష్ణ సినీ స్టూడియోస్”, నందమూరి హరికృష్ణ (Nandamuri Harikrishna) కూడా “జానకిరామ్” అనే పేరు మీద బ్యానర్ స్టార్ట్ చేసారు, జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కూడా తన కుమారుడి పేరు మీద ఒక బ్యానర్ స్టార్ట్ చేద్దామనుకున్నాడు.
ఇప్పుడు ఈ జాబితాలో బాలయ్య కుమార్తె నందమూరి తేజస్విని (Tejaswini) కూడా చేరింది. అయితే.. ఆమె మిగతావాళ్లలాగ కుటుంబ సభ్యుల పేర్లతో కాకుండా, తన తండ్రి బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన “లెజెండ్” టైటిల్ ను స్ఫూర్తిగా తీసుకొని “లెజెండ్ ప్రొడక్షన్స్” అనే బ్యానర్ ను స్థాపించి..
తొలి సినిమాగా తమ్ముడు మోక్షజ్ఞ డెబ్యూ ఇస్తున్న సినిమాకి సమర్పకురాలిగా వ్యవహరిస్తోంది. ఈ బ్యానర్ లో భవిష్యత్ లో భారీ సినిమాలు మరియు కాన్సెప్ట్ సినిమాలు తీయాలని కూడా ప్లాన్ చేస్తోంది తేజస్విని(Tejaswini). చెల్లెల్ని స్ఫూర్తిగా తీసుకొని అక్క బ్రాహ్మణి కూడా ఏదైనా ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేస్తుందేమో అనే వాదనలు కూడా వినిపిస్తున్నప్పటికీ..
ఆల్రెడీ హెరిటేజ్ కామెపేనేని చూసుకుంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న బ్రాహ్మణి మాత్రం సినిమా ప్రొడక్షన్ రంగంలోకి దిగడం కష్టమే అంటున్నారు.
ఇకపోతే.. ఇప్పటికే తండ్రి బాలయ్య సినిమా కథల నుండి ప్రొడక్షన్ వరకు అన్నీ విషయాల్లో సైలెంట్ గా ఇన్వాల్వ్ అవుతున్న తేజస్విని ఇప్పుడు డైరెక్ట్ గా ప్రొడక్షన్ లోకి దిగడంతో.. ఆమె పెద్ద ప్రొడ్యూసర్ గా ఎదగడం ఖాయం అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు!