బాలయ్య ఫ్యాన్స్ కు ఆ విషయంలో నిరాశే.. ఏమైందంటే?

  • June 8, 2023 / 11:21 AM IST

స్టార్ హీరో బాలకృష్ణ సినిమా అంటే పవర్ ఫుల్ టైటిల్ తో పాటు అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు ఉండాలని అభిమానులు భావిస్తారనే సంగతి తెలిసిందే. బాలయ్య అనిల్ కాంబో మూవీ టైటిల్ కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. భగవంత్ కేసరి అనే పవర్ ఫుల్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఐ డోంట్ కేర్ అనే ట్యాగ్ లైన్ టైటిల్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయింది.

భగవంత్ కేసరి అనే టైటిల్ వినడానికి ఒకింత కొత్తగా ఉన్నా నెమ్మదిగా ఈ టైటిల్ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టర్ లో బాలయ్య చేతిలో ఆయుధం ఉండగా ఈ ఆయుధం కొత్తగా ఉంది. అయితే ఈ పోస్టర్ లో రిలీజ్ డేట్ గురించి మాత్రం క్లారిటీ లేదు. దసరాకు ఈ సినిమా విడుదల కానుందని ఇప్పటికే ఫిక్స్ అయింది.

రిలీజ్ డేట్ కు సంబంధించి రాబోయే రోజుల్లో ఇచ్చే అప్ డేట్స్ లో అయినా క్లారిటీ వస్తుందేమో చూడాలి. రిలీజ్ డేట్ కు సంబంధించి అనిల్ రావిపూడి స్పష్టత ఇవ్వాల్సి ఉంది.కాజల్, శ్రీలీల ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలయ్య కూతురి పాత్రలో శ్రీలీల కనిపించనుండగా కాజల్ టీచర్ రోల్ లో కనిపిస్తారని తెలుస్తోంది. 14 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన వ్యక్తి పాత్రలో బాలయ్య కనిపించనున్నారు.

బాలయ్య సింగిల్ రోల్ లోనే ఈ సినిమాలో కనిపించనున్నారు. బాలయ్య కామెడీ చేయడని ఆయన పాత్ర చుట్టూ ఉండేవాళ్లు చేసే కామెడీ మాత్రం మామూలుగా ఉండదని సమాచారం. బాలయ్య ఖాతాలో ఈ సినిమా మరో హిట్ గా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో బాలయ్యకు మరిన్ని విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus