Balakrishna: రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్ కు తెర దించాలంటున్న బాలయ్య ఫ్యాన్స్.. కానీ?

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ బాబీ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది రిలీజ్ కానున్న చాలా సినిమాలు ఇప్పటికే రిలీజ్ డేట్లను ప్రకటించుకున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించి కూడా క్లారిటీ వచ్చింది. అయితే బాలయ్య బాబీ కాంబో మూవీ రిలీజ్ డేట్ గురించి మాత్రం పూర్తిస్థాయిలో స్పష్టత లేదనే సంగతి తెలిసిందే. రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్ కు తెర దించాలని బాలయ్య అభిమానులు కోరుకుంటుండగా మేకర్స్ స్పందిస్తారో లేదో చూడాల్సి ఉంది.

సితార బ్యానర్ లో తెరకెక్కిన టిల్లు స్క్వేర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు రిలీజైన తర్వాతే బాలయ్య బాబీ మూవీ గురించి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే బాలయ్య ఫ్యాన్స్ మాత్రం రిలీజ్ డేట్ ప్రకటన ఆలస్యమైతే ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. బాలయ్య త్వరలో పొలిటికల్ కార్యక్రమాలతో బిజీ కానున్న నేపథ్యంలో ఆ సమయానికి రిలీజ్ డేట్ గురించి స్పష్టత వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

బాలయ్య బాబీ కాంబో మూవీలో సెకండాఫ్ వేరే లెవెల్ లో ఉంటుందని సినిమాలోని చివరి 40 నిమిషాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉండనుందని సమాచారం అందుతోంది. బాలయ్య నుంచి ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని భోగట్టా. బాలయ్య పొలిటికల్ కార్యక్రమాల వల్ల ఈ సినిమా షూట్ ఆలస్యమయ్యే ఛాన్స్ అయితే ఉంది. మరోవైపు బాలయ్య కొత్త సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది.

బాలయ్య (Balakrishna) ఒక సినిమా పూర్తైన తర్వాత మరో సినిమాకు ఓకే చెబుతున్నారు. బాలయ్య సినిమాలు విడుదలైన సమయంలో థియేటర్లు సైతం కళకళలాడుతున్నాయి. బాలయ్య ఫ్యాన్ బేస్ ను ఊహించని స్థాయిలో పెంచుకుంటున్నారు.

ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!

‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus