నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ మంచి చిత్రం గా పేరు తెచ్చుకోవడంతో పాటు భారీ కలక్షన్స్ వసూల్ చేసింది. ఉత్తమ చిత్రాల దర్శకుడు క్రిష్ రూపొందించిన ఈ మూవీ జనవరి 12 న విడుదలై బాలయ్య గత 99 చిత్రాల రికార్డులను తిరగరాసింది. రాజీవ్ రెడ్డి, సాయి బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ ఫిల్మ్ విడుదలైన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలక్షన్స్ తో ప్రదర్శితమవుతోంది.
తన వందో చిత్రం సంతృప్తిని కలిగించడంతో పాటు, లాభాలను తెచ్చిపెట్టడంతో బాలకృష్ణ చాలా సంతోషంగా ఉన్నారు. ఆ ఆనందాన్ని శాతకర్ణి టీమ్ తో పంచుకునేందుకు సిద్ధమయ్యారు. చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ గ్రాండ్ పార్టీని ఇస్తున్నారు. రేపు హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్లో పార్టీ ఇవ్వనున్నట్లు తెలిసింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.