చిరు అల్లుడు సినిమా వేడుకకు రానున్న బాలకృష్ణ

మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ ఒకే వేదికపైకి రానున్నారా?.. కలిసి నందమూరి, మెగా అభిమానులకు ఆనందాన్ని పంచనున్నారా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. మెగాస్టార్ చిన్న అల్లుడు, శ్రీజ భ‌ర్త కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా విజేత. రాకేష్ శ‌శి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలోని “కో కొక్కొరొకో” పాట నేడు రిలీజ్ మంచి స్పందన అందుకుంది. పూర్తి పాటలను ఈనెల 24 న రిలీజ్ చేయనున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా వస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఇదే వేడుకకు నటసింహ బాలకృష్ణ విశిష్ట అతిధిగా హాజరుకాబోతున్నట్టు సమాచారం. ఈ చిత్ర నిర్మాత సాయి కొర్రపాటికి బాలయ్య కి మధ్య మంచి స్నేహం ఉంది. ప్రస్తుతం బాలయ్య నటిస్తూ నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ మూవీకి కూడా సాయి సహా నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఆ అనుబంధంతోనే ఈ వేడుకకు బాలయ్య వస్తున్నట్లు తెలిసింది. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే వేదికపైకి వస్తే చూసేందుకు అభిమానులకు రెండు కళ్లు సరిపోవు. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం జులై 6న రిలీజ్ థియేటర్లోకి రానుంది. తొలి సినిమాతో కళ్యాణ్ దేవ్ ఎంత మేర మెగా అభిమానులను ఆకట్టుకుంటారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus