Balayya,Ram: రామ్‌ సినిమాలో నటసింహాన్ని చూస్తామా..!

హీరో మీద అభిమానంతో మరో హీరో వచ్చి సినిమాలో చిన్న సన్నివేశంలో నటించడం ఎక్కువగా చూస్తుంటాం. అయితే దర్శకుడి మీద అభిమానంతో ఇలా నటించిన వాళ్లూ ఉన్నారు. ఇప్పుడు రెండో రకం కాన్సెప్ట్‌లో బాలకృష్ణ ఓ కుర్ర హీరో సినిమాలో నటించబోతున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ఒకవేళ అదే జరిగితే.. రెండు పవర్‌ హౌస్‌లు ఒక ఫ్రేమ్‌లో కనిపిస్తాయి. దానికి మరో పవర హౌస్‌ డైరక్షన్‌ వహిస్తుంది. రామ్‌ హీరోగా బోయపాటి శ్రీను ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవల సినిమాకు సంబంధించి పాటల్ని హైదరాబాద్‌లోని ఓ స్టూడియో తెరకెక్కించారు. త్వరలో కొన్ని కీలక టాకీ సీన్స్‌ తెరకెక్కించాల్సి ఉంది. అందులో నందమూరి బాలకృష్ణ కనిపిస్తారని వార్తలొస్తున్నాయి. ఈ మేరకు బాలయ్యను ఒప్పించే పని బోయపాటి తీసుకున్నారని చెబుతున్నారు. బాలయ్యకు బోయపాటి ‘సింహా’, ‘లెజెండ్‌’, ‘అఖండ’ లాంటి విజయాలు అందించారు. ఈ అభిమానంతో బాలయ్య ఓకే చెబుతారనే చర్చ నడుస్తోంది. రామ్‌ – బోయపాటి సినిమాల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో కీల‌క‌మైన ఘ‌ట్టం ఒకటి ఉందట.

అందులో భారీ మాస్‌ ఇమేజ్‌ ఉన్న ఓ స్టార్‌ నటుడు ఉంటే బాగుంటుంది అని టీమ్‌ అనుకుందట. సినిమా మొత్తానికి హైలైట్‌ అయ్యే ఆ పాత్రకు బాల‌య్య అయితే బాగుంటాడని అనుకున్నారట. ఈ క్రమంలో ఆయనను సంప్రదించాలని అనుకుంటున్నారట. ఆ పనిని బోయపాటికి అప్పగించారని చెబుతున్నారు. మరి బోయపాటి మాటకు బాలయ్య ఏం చెబుతారో చూడాలి. బాలయ్య ఇలాంటి అతిథి పాత్రలకు వ్యతిరేకం ఏమీ కాదు.

మంచు మనోజ్‌తో ‘ఉ కొడతారా ఉలిక్కి పడతారా’ లాంటి సినిమాలో చిన్న అతిథి పాత్ర వేశారు. ఇప్పుడు మరి రామ్‌ సినిమాలో నటిస్తారా లేదా చూడాలి. ఆ పాత్రను, సినిమాను హ్యాండిల్‌ చేసేది బోయపాటి కాబట్టి.. బాలయ్య పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా రాసుంటారో మనం ఊహించుకోవచ్చు. ఈ లెక్కన అతిథిగా తన సత్తా చాటుకునే అవకాశం బాలయ్యకు వస్తోంది. మరి ఆయనేం చేస్తారో చూడాలి.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus