Balayya Babu: నాని కోరిక మేరకు బాలకృష్ణ అలా చేస్తారా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ కథ నచ్చితే ఎలాంటి కథలో అయినా నటించడానికి సిద్ధంగా ఉంటారు. మాస్ సినిమాలు బాలకృష్ణకు మంచి పేరు తెచ్చిపెడుతుండగా హిట్3 లో బాలకృష్ణ కనిపించనున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. హిట్2 మూవీని థియేటర్ లో చూసిన బాలకృష్ణ ఈ సినిమా గురించి పాజిటివ్ గా స్పందించిన సంగతి తెలిసిందే. హిట్3 సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.

హిట్3 సినిమాలో బాలయ్య గెస్ట్ రోల్ లో కనిపించే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. హిట్3 సినిమాలో తాను కూడా ఉంటానని అడివి శేష్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హిట్ ఫ్రాంఛైజ్ లో నటించాలని హిట్ మేకర్స్ బాలయ్యను అడగగా బాలకృష్ణ చూద్దాం అని చెప్పారని బోగట్టా. నిర్మాత నాని కోరితే ఫుల్ లెంగ్త్ రోల్ లో కాకపోయినా హిట్3 లో అతిథి పాత్రలో కనిపించి బాలయ్య మెప్పించే ఛాన్స్ అయితే ఉంది.

అయితే అధికారక ప్రకటన వస్తే మాత్రమే వైరల్ అయిన వార్తలో నిజానిజాలు తెలుస్తాయని చెప్పవచ్చు. బాలయ్య ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల 8వ తేదీ నుంచి బాలకృష్ణ అనిల్ మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. హిట్ సిరీస్ తరహా పాత్రలలో బాలయ్య ఎప్పుడూ నటించలేదు.

బాలయ్య నటిస్తే హిట్ సిరీస్ కూడా కొత్తగా ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హిట్3 లో బాలయ్య నటిస్తారో లేక ఏదైనా హిట్ సిరీస్ లో ఫుల్ లెంగ్త్ రోల్ లో బాలయ్య నటిస్తారో తెలియాల్సి ఉంది. బాలకృష్ణ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం బాలయ్య అభిమానులను సంతోషపెడుతోంది.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus