Jailer Movie: ‘జైలర్’ లో బాలకృష్ణ పాత్ర అలా మిస్ అయ్యిందట..!

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమా రెండు రోజుల క్రితం రిలీజ్ అయ్యింది. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. గతంలో ఇతను ‘వరుణ్ డాక్టర్’ ‘బీస్ట్’ వంటి చిత్రాలను తెరకెక్కించాడు. ఇందులో వరుణ్ డాక్టర్ సూపర్ హిట్ అయ్యింది. నయనతారతో ‘కో కో కోకిల’ అనే సినిమా కూడా చేశాడు. అది కూడా బాగానే ఆడింది. ఇక తన నాలుగో చిత్రాన్ని సూపర్ స్టార్ రజినీకాంత్ తో చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు.

ఆగస్టు 10 న రిలీజ్ అయిన ఈ సినిమా (Jailer Movie) మొదటి షోతోనే సూపర్ సక్సెస్ అందుకుంది. రజినీకాంత్ కి చాలా ఏళ్ళ తర్వాత ఓ సరైన బ్లాక్ బస్టర్ ను అందించింది ఈ చిత్రం. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, బాలీవుడ్ సీనియర్ హీరో జాకీ ష్రాఫ్, మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ వంటి వారు గెస్ట్ రోల్స్ చేశారు. వాళ్ళ కేమియోలు కూడా అదిరిపోయాయి అని చెప్పాలి. ఇది పాన్ ఇండియా స్ట్రాటజీనే… అయినప్పటికీ అలా అతికినట్టు ఎక్కడా అనిపించలేదు.

ఎందుకంటే వీళ్ళ కామియోలకి తగ్గట్టు అనిరుధ్ బిజీయం ఆ రేంజ్లో ఇచ్చాడు. అయితే శివరాజ్ కుమార్ లానే టాలీవుడ్ నుండి కూడా బాలకృష్ణని పెట్టుంటే అదిరిపోయేది అని ‘జైలర్’ చూసిన తెలుగు ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. వాస్తవానికి ఈ సినిమాలో బాలకృష్ణ కోసం కూడా ఓ కామియో అనుకున్నారట. కానీ అది సెట్ అవ్వలేదు అని దర్శకుడు నెల్సన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. నిజంగా బాలయ్యకి ఓ కూడా ఓ కేమియో పడి ఎలివేషన్ కనుక ఉంటే జనాలకి పూనకాలు వచ్చేసి ఉండేవేమో.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus