Balakrishna: ‘భగవంత్‌ కేసరి’ ఇచ్చిన ఊపు… బాలకృష్ణ మరింత ఉత్సాహంతో..

సినిమా తర్వాత సినిమా… బాలయ్య ఎక్కువగా ఇలానే సినిమాలు చేస్తూ ఉంటారు. ఒక సినిమా అయిపోయింది అనుకుంటుండగానే కథ, సినిమా ఓకే చేసేస్తారు. అలా ఇప్పుడు ఆయన ‘భగవంత్‌ కేసరి’ సినిమా చివరి దశకు వచ్చేసరికి బాబీ సినిమాను ఓకే చేసేశారు. ఆ తర్వాత సినిమాకు కొబ్బరికాయ కూడా కొట్టేశారు. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించడానికి సర్వం సిద్ధమైంది. సినిమా తొలి షెడ్యూల్‌ ప్రారంభిచేస్తారట. ‘భగవంత్‌ కేసరి’ సినిమాతో దసరాకు బాక్సాఫీసు దగ్గరకు వచ్చి అదిరిపోయే విజయాన్ని అందుకున్నాడు నందమూరి బాలకృష్ణ.

ఈ జోష్‌లోనే తన 109వ సినిమాను ప్రారంభించబోతున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా తొలి షెడ్యూల్‌ నవంబరు 6 నుండి ప్రారంభమవుతుందని సమాచారం. సూర్యదేవర నాగవంశీ, ఎస్‌.సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా తొలి షెడ్యూల్‌ యాక్షన్‌ సీన్స్‌తోనే ఉంటుందని సమాచారం. ఈ మేరకు సినిమా కోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ సిద్ధం చేశారట. 1980ల నేపథ్యంలోని ఓ మాస్‌ + యాక్షన్‌ కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తారట.

ఇందులో బాలకృష్ణ (Balakrishna) ఇప్పటివరకు చేయని శక్తిమంతమైన పాత్రలో కనిపిస్తాడని సమాచారం. ఈ మేరకు బాలయ్య లుక్‌లో కూడా మార్పులు చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో కూడా ఇద్దరు బాలయ్యలు ఉంటారు అని చెబుతున్నారు. దానికి తగ్గట్టే కథను సిద్ధం చేశారట. ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేసే ప్రక్రియ తుది దశకు చేరింది అని చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ పోస్టర్‌కు చక్కటి స్పందన వచ్చింది.

‘ఈ ప్రపంచానికి ఆయన తెలుసు… కానీ ఆయన ప్రపంచంలో ఎవరికీ తెలియదు’ అంటూ ఆ పోస్టర్‌ మీద రాసుకొచ్చారు. అలాగే అందులో ఓ పాత పెట్టెలో పాత ఆయుధాలు, కరెన్సీ, మద్యం సీసా ఉన్నాయి. వాటి ప్రకారమే ఈ సినిమాలో కీలక సన్నివేశాలు 1980ల కాలంలో ఉంటుందని అని అంచనా వేస్తున్నారు. సినిమా ప్రారంభమైతే కానీ ఈ విషయంలో క్లారిటీ రావొచ్చు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus