కథానాయకుడికి పాత్రలెక్కువే.. !

క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో నందమూరి బాలకృష్ణ నటించిన ‘ఎన్టీఆర్ బయోపిక్’ మొదటి భాగమైన ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9వ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్ర ప్రమోషన్ల జోరు పెంచింది చిత్ర యూనిట్. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ఎటువంటి కట్స్ లేకుండా క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్ ను పొందడం విశేషం. ఇక ఈ చిత్రంలో ‘ఎన్టీఆర్’ పాత్రను అద్భుతంగా పోషించాడంట బాలయ్య. ఇక ఈ చిత్రానికి కీరవాణి అందించిన సంగీతం హైలైట్ గా నిలువబోతుందట. అప్పట్లో ‘ఎన్టీఆర్’ ఎన్నో విభిన్నమైన చిత్రాల్లో నటించారు. పౌరాణిక చిత్రాల్లో రాముడు,కృష్ణుడు, అర్జునుడు, భీముడు, దుర్యోదనుడు ఇలా ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించారు.

తాజాగా ఈ చిత్ర ప్రమోషన్లను మొదలు పెట్టింది చిత్ర యూనిట్. ఈ చిత్రంలో నటించిన పాత్రదారులను ఒక్కొక్కరూ ప్రమోషన్ లకు హాజరువుతుండడం విశేషం. ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ పూర్తిగా ఎన్టీఆర్ నటనా జీవితానికి సంబంధించింది కాబట్టి.. ఈ చిత్రంలో బాలకృష్ణ 63 గెటప్స్ లో కనిపించబోతున్నాడట. ఇక ఈ చిత్రంలో విద్యాబాలన్,రకుల్,తమన్నా, నిత్యామీనన్,హన్సిక, రానా, సుమంత్,కల్యాణ్ రామ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రం రెండవ భాగమైన ‘ఎన్టీఆర్ – మహానాయకుడు’ ఫిబ్రవరి 7 న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus