నిన్న సాయంత్రం “ఎన్టీఆర్” బయోపిక్ దర్శకత్వ బాధ్యతల నుంచి తేజ తప్పుకున్నారు అనే వార్త బయటకొచ్చినప్పట్నుంచి అందరూ ఊహించుకొంటున్న ఏకైక రీజన్ “బాలయ్యతో తేజకి సెట్ అవ్వలేదేమో లేక బాలయ్యకి తేజాకి క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయేమో”. బాలయ్య దూకుడు, తేజ యాటిట్యూడ్ ని కాస్త గమనించిన వారెవరైనా సరే అది నిజమే అనుకొంటారు కూడా. అయితే.. అసలు రీజన్ అది కాదని తెలుస్తోంది. నిజానికి బాలయ్యతో తేజకి ఎలాంటి సమస్యా లేదట, పైగా తేజ & బాలయ్యకి మంచి కెమిస్ట్రీ సింక్ కూడా అయ్యిందట.
అయితే.. అసలు సమస్య తలెత్తింది చిత్ర నిర్మాతల్లో ఒకరైన విష్ణు ఇందూరితో అని తెలుస్తోంది. ప్రీప్రొడక్షన్ టైమ్ లో దర్శకుడు తేజ మరియు కథ అందించడంతోపాటు సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్న విష్ణు ఇందూరికి నడుమ క్రియేటివ్ డిఫరెన్సెస్ మాత్రమే కాక క్యాస్టింగ్ అండ్ ప్రొడక్షన్ విషయంలోనూ ఇద్దరికీ పడడం లేదట. దాంతో.. తేజ ఈ గోల భరించలేక బయటకొచ్చేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం తేజ తాను వెంకటేష్ హీరోగా తీయబోయే “ఆట నాదే వేట నాదే” ప్రీప్రొడక్షన్ వర్క్ మీద కాన్సన్ ట్రేట్ చేస్తున్నాడట. త్వరలోనే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి బాలయ్య దర్శకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తాడో చూడాలి. ప్రస్తుతానికైతే రాఘవేంద్రరావుగారి పేరు మాత్రం బాగా వినిపిస్తోంది.