యంగ్ టైగర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ అనేది నందమూరి అభిమానులతో పాటు, టీడీపీ వర్గాలలో అతిపెద్ద చర్చనీయాంశం. ఎన్టీఆర్ పొలిటీషియన్ గా టీడీపీలో కీలక పాత్ర పోషించాలని కొందరు బావిస్తున్నారు. ఐతే ఈ విషయం రుచించని వారు కూడా కొందరు ఉన్నారు. బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ అవసరం టీడీపీకి లేదు, చంద్రబాబు, లోకేష్ నాయకత్వంలో టీడీపీ అభివృద్ధి చెందుతుంది అన్నారు. ఆయన వస్తే రావచ్చు, ఆయన వచ్చినా..
రాకున్నా పార్టీకి పెద్దగా ఒరిగేది ఏమి లేనట్లు ఆయన మాటలు ఉన్నాయి. గత ఎన్నికలో టీడీపీ ఘోరపరాజయం తర్వాత ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాల్సిందే అని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ మాత్రమే ప్రస్తుత గడ్డు పరిస్థితులనుండి కాపాడగలడు అనేది వారి వాదన. కాగా బాలకృష్ణ ఈ విషయంపై నోరువిప్పారు. ఆయన తాజా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి అడిగితే ఆసక్తికరంగా స్పందించారు. రాజకీయాలలోకి రావాలన్నది, లేదన్నది ఎన్టీఆర్ ఇష్టం అన్నారు.
సినిమాలు చేస్తూ పాలిటిక్స్ లో ఉండడం తప్పేమీ కాదు అన్నారు. నేను కూడా ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నాను, అలాగే సినిమాలు చేస్తున్నాను. గతంలో నాన్న ఎన్టీఆర్ కూడా పాలిటిక్స్ లోకి వెళ్లిన తరువాత కూడా సినిమాలు చేశారని గుర్తు చేసుకున్నారు. కాబట్టి ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి వచ్చేది రానిది అనేది అతని వ్యక్తిగత అంశం అన్నట్లు బాలయ్య చెప్పుకొచ్చారు.
Most Recommended Video
రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్ వందాల్’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!