ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో మల్టీ స్టారర్ కు నో చెప్పిన బాలయ్య?

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో టాలీవుడ్లో మళ్ళీ మల్టీ స్టారర్లు మొదలయ్యాయి. ఇప్పటికే ‘మసాలా’ ‘మనం’ ‘గోపాల గోపాల’ ‘దేవదాస్’ ‘ఎఫ్2 ‘ ‘వెంకీమామ’ వంటి మల్టీ స్టారర్ లు వచ్చాయి. అయితే వీటన్నిటిలో ‘మనం’ చిత్రానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ చిత్రంలో అక్కినేని మూడు జెనరేషన్ హీరోలు కలిసి నటించారు. ఇలాంటి బంపర్ ఆఫర్ మరో ఫ్యామిలీకి దక్కుతుందో లేదో కచ్చితంగా చెప్పలేము. ఇక మెగా ఫ్యామిలీ హీరోల సినిమాల్లోనే ఆ ఫ్యామిలీకి చెందిన హీరోలు కనిపిస్తూనే వస్తున్నారు.

చెప్పాలంటే.. ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’ ‘శంకర్ దాదా జిందాబాద్’ వంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు. ‘ఖైదీ నెంబర్ 150’ ‘బ్రూస్ లీ’ ‘మగధీర’ వంటి చిత్రాల్లో చరణ్, చిరు లు కనిపించి అభిమానులని ఖుషీ చేయించారు. అయితే నందమూరి అభిమానులకు మాత్రం ఇలాంటి సర్ ప్రైజ్ లు దక్కలేదు. సరే.. అది పక్కన పెట్టేస్తే.. గతేడాది కళ్యాణ్ రామ్.. ఎన్టీఆర్, బాలయ్య లతో కలిసి నటించేందుకు ఓ స్క్రిప్ట్ రెడీ చేయించాడట. దీనికి తారక్ కూడా ఓకే చెప్పాడట. కానీ బాలయ్య మాత్రం నో చెప్పాడని ఇన్సైడ్ టాక్.

అయితే కారణం ఏంటనేది మాత్రం బాలయ్య.. కళ్యాణ్ రామ్ కు చెప్పలేదట. ఇదే విషయాన్ని కళ్యాణ్ రామ్.. తారక్ తో డిస్కస్ చెయ్యగా .. ‘బహుశా బాబాయ్ కు కథ నచ్చలేదేమో..! ఆయనకు నచ్చే కథ దొరికే వరకూ వెయిట్ చేద్దాం’ అని చెప్పాడట. అయితే బాలయ్యకు కళ్యాణ్, తారక్ లతో కలిసి నటించడం ఇష్టం లేక నో చెప్పాడా..? లేక నిజంగానే కథ నచ్చలేదా? అనే అనుమానాలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

Most Recommended Video

కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus