టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా బాలయ్య మాట్లాడుతూ అసెంబ్లీలో మీసం మెలేసి తొడగొట్టి నా వృత్తిని అంబటి అవమానించాడని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు అలా చేసి తాను చేయని పనిని చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. తన గురించి స్పీకర్ తో కూడా అబద్ధాలు చెప్పించారని బాలయ్య పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల చేతిలో తగిన మూల్యం చెల్లించుకునే రోజు వస్తుందని బాలయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో తనను మాత్రమే అవమానించలేదని సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని అవమానించారని బాలయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. సినిమా రంగం నుంచి అసెంబ్లీకి వెళ్లిన అన్నగారు ఎంతోమందికి రాజకీయ భిక్ష పెట్టారని బాలయ్య చెప్పుకొచ్చారు. అంబటి రాంబాబు రా చూసుకుందాం అని అనడంతో తాను కూడా రా చూసుకుందాం అని అన్నానని బాలయ్య తెలిపారు. వైజాగ్ లో ఏపీ సర్కార్ జూనియర్ ఆర్టిస్ట్ లతో ఒప్పందం కుదుర్చుకుందని బాలయ్య కామెంట్లు చేశారు.
చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని స్పీకర్ ను కోరామని బాలయ్య పేర్కొన్నారు. చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలని కోరామని బాలయ్య వెల్లడించారు. రోమ్ తగలబడుతుంటే చక్రవర్తి ఫిడేల్ వాయించారని ఏపీ సీఎం జగన్ తీరు ఇదే విధంగా ఉందని బాలయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం రాష్ట్ర అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదని బాలయ్య అన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కు సంబంధించి ఛార్జ్ షీట్ ను ఎందుకు దాఖలు చేయలేదని బాలయ్య కామెంట్లు చేశారు. బాలయ్య చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. బాలయ్య నటించిన భగవంత్ కేసరి మరో నెల రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!