సంచలన కామెంట్స్ చేసిన బాలకృష్ణ

తెలుగు సినీ పరిశ్రమలో నటసింహ బాలకృష్ణకి ప్రత్యేకమైన స్థానం ఉంది. మహానటుడు నందమూరి తారకరామారావు తనయుడిగా అడుగుపెట్టి సంచలన విజయాలు సాధించారు. సినీ రంగంలో తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారు. అలాగే రాజకీయాల్లోనూ చురుకుగా ఉన్నారు. ఎమ్మెల్యే గా ప్రజలకు సేవ చేస్తున్నారు. అటువంటి వ్యక్తి ఏ విషయంలో.. ఎవరికీ భయపడరు. కానీ తనని ఆరాధించే అభిమానులను చూసి బయపడుతున్నారు. ఆ విషయాన్నిస్వయంగా చెప్పారు. వివరాల్లోకి వెళితే.. గతవారం దుబాయ్ లో జరిగిన సైమా వేడుకల్లో నటుడు రానాతో కలిసి బాలకృష్ణ పాల్గొన్నారు.

రానాతో కలిసి రెడ్ కార్పెట్‌పై నడిచారు. అక్కడ విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. రానా తరహాలో విలన్ పాత్రలు పోషిస్తారా? అంటే అందుకు తాను సిద్ధమేనన్నారు. అయితే తాను విలన్ పాత్రలు చేస్తే అభిమానులు తనపై కేసులు పెడతారేమోనని సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ.. ఎన్టీఆర్ గా గా నటిస్తుండగా.. రానా చంద్రబాబునాయుడి పాత్రని పోషిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లో రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus