Balakrishna: పెదకాపు మూవీకి బాలయ్య సపోర్ట్.. అలా చేయబోతున్నారా?

  • September 22, 2023 / 12:04 PM IST

విరాట్ కర్ణ హీరోగా శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పెదకాపు1 సినిమా భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలవుతోంది. ఈ నెల 29వ తేదీన ఈ సినిమా విడుదల కానుండగా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ నెల 23వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బాలయ్య ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సినిమాకు మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాత కాగా బాలయ్య అఖండ సినిమాకు ఈయనే నిర్మాత అనే సంగతి తెలిసిందే. రవీందర్ రెడ్డికి బాలయ్య సన్నిహితుడు కావడంతో పెదకాపు మూవీ ఈవెంట్ కు బాలయ్య వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్థితుల వల్ల బాలయ్య సంతోషంగా లేరు. ఈ రీజన్ వల్ల బాలయ్య ఈ ఈవెంట్ కు వస్తారో లేదో గ్యారంటీగా చెప్పలేము.

పెదకాపు మూవీకి బాలయ్య ఏ విధంగా సపోర్ట్ చేసినా ఈ సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. బాలయ్య సినిమా భగవంత్ కేసరి ప్రమోషన్స్ కూడా త్వరలో మొదలుకానున్నాయి. బాలయ్యకు ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలయ్య ఈ సినిమాకు 25 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారని సమాచారం అందుతోంది.

బాలయ్య (Balakrishna) బాబీ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా భారీ రేంజ్ లో ఉండనుందని సమాచారం అందుతోంది. బాలయ్య బాబీ కాంబో మూవీ ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. బాలయ్య బాబీ కాంబో మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. వచ్చే ఏడాది రెండు సినిమాలు విడుదలయ్యేలా బాలయ్య కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus