“బాహుబలి”ని టార్గెట్ చేసిన బాలయ్య!!!

టాలీవుడ్ లో బాలయ్య తీరే వేరు, 100 సినిమాలకు పైగా పూర్త చేసుకుని తన తరువాత సినిమా పక్కా..ఫక్తు కమర్షియల్ సినిమాలు చేసే హీరోలు ఉన్న మన ఇండస్ట్రీ లో, తన 100వ చిత్రం చరిత్రలో నిలిచిపోయేది కావాలని, అంతేకాకుండా ఆంధ్రుల కలల రాజధాని అమరావతి చరిత్రని అందరికీ చూపించాలనే ప్రయత్నంలో ఏ మాస్ హీరో చెయ్యని సాహసం బాలయ్య చేస్తున్నాడు. అయితే బాలయ్య చేస్తున్న “గౌతామీ పుత్ర శాతకర్ణీ” చిత్రంపై మొదటి నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఈ సినిమా బాహుబలి లాగా భారీ హిట్ అవుతుంది అని కొందరు అంటుంటే, కాదు కాదు బాహుబలిని మించిన హిట్ అవుతుంది అని మరికొందరు చెబుతున్నారు….అయితే బాహుబలిని మించిన సినిమా ఎలా అవుతుంది అంటే చాలా కారణాలే చెబుతున్నారు….అవేమిటంటే…ఇప్పటివరకూ అతి తక్కువ బడ్జెట్ తో మంచి క్వాలిటీతో రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసిన క్రిష్ ప్రతిభ ఒకటి కాగా, మరో పక్క కీలక సన్నివేశాలన్నీ’మొరాకో’లో జరగటంతో ఈ మూవీకి రిచ్ నెస్ భారీగా పెరిగినట్లు సైతం వార్తలు వస్తున్నాయి. ఇక అదే క్రమంలో యుద్ధ సన్నివేశాలను జార్జియాలో ప్లాన్ చేశారు.

జార్జియాలోని ‘మౌంట్ కజ్ బెగ్’ ప్రాంతంలో శాతవాహన కాలం నాటి సైనికులు.. గ్రీకు సైనికులు తలపడే సన్నివేశాలను భారీ స్థాయిలో చిత్రీకరించనున్నారు. ఇప్పటి వరకూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్క బాహుబలి మాత్రమే ఈ తరహా భారీ చిత్రీకరణ జరుపుకుంది. ప్రతి షెడ్యూల్ కి బాహుబలికి మించిన టెక్నాలజీతో షూటింగ్ ని చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ కచ్ఛితంగా బాహుబలిని మించిన మూవీ అవుతుందని అంటున్నారు. అంతేకాకుండా మార్కెట్ విషయంలో కూడా ఈ సినిమాకు భారీ డిమాండ్ ఏర్పడటంతో బాలయ్య బాహుబలిని టార్గెట్ చేశాడు అన్న వాదన వినిపిస్తుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus