టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) రూటే సపరేట్ అనే సంగతి తెలిసిందే. బాలయ్య హిందూపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తుండగా బాలయ్యకు ఓటు హక్కు సైతం హిందూపురంలోనే ఉంది. హిందూపురం నుంచి మరోమారు ఎమ్మెల్యేగా గెలిచి బాలయ్య హ్యాట్రిక్ సాధిస్తానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అయితే బాలయ్య ఓటు వేసే సమయంలో చేసిన పని నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ఓటర్లను ప్రభావితం చేసేలా పార్టీ జెండాలు, కండువాలతో కనిపించకూడదని నిబంధనలు ఉన్నాయి.
అయితే బాలయ్య మాత్రం పసుపు కండువా వేసుకుని క్యూ లైన్ లో నిలబడ్డారు. బాలయ్య బాబు కండువా వేసుకోవడం రూల్స్ కు విరుద్ధం అయినా బాలయ్యను అడిగితే ఆయన రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో అవగాహన ఉంటుంది కాబట్టి ఎవరూ ఆయన కండువా విషయంలో అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అయితే సరిగ్గా ఓటు వేసే సమయంలో మాత్రం బాలయ్య కండువా వేసుకోలేదని తెలుస్తోంది.
బాలయ్య ఫ్యాన్స్ మాత్రం బాలయ్య లెక్క వేరే ఉంటుందని చెబుతున్నారు. తనకు నచ్చిందే బాలయ్య చేస్తారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పిఠాపురంలో వంగా గీత ఒక ఓటర్ ఎర్ర కండువా వేసుకోవడం విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రెండు ఘటనలకు సంబంధించిన వీడియోను యాడ్ చేసి ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. బాలయ్య బాబీ (K. S. Ravindra) మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలుకానుంది.
ఈ ఏడాదే ఈ సినిమా విడుదలవుతుందో లేక సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదలవుతుందో తెలియాల్సి ఉంది. విశ్వంభర (Vishwambhara) ఇప్పటికే సంక్రాంతికి డేట్ ను ఫిక్స్ చేసుకున్న నేపథ్యంలో బాలయ్య నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది. బాలయ్య వరుస విజయాలు సాధించి కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.