దసరా పండుగ కానుకగా ఈ ఏడాది రిలీజవుతున్న సినిమాలలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న అఖండ సినిమా కూడా ఒకటి. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 13వ తేదీన రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ ఖచ్చితంగా వాయిదా పడే పరిస్థితులు ఉండటంతో అఖండ సినిమాను దసరాకు రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ మేరకు అధికారిక ప్రకటన రానుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఆచార్య దసరా రేసు నుంచి దాదాపుగా తప్పుకోవడంతో అఖండకు కలెక్షన్ల విషయంలో పోటీనిచ్చే సినిమా అయితే లేదనే చెప్పాలి.
దసరా పండుగకు పలువురు యంగ్ హీరోల సినిమాల రిలీజ్ డేట్లు ఫిక్స్ అయినా అఖండతో పోటీ వల్ల ఆ సినిమాలు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అఖండ అక్టోబర్ 13వ తేదీన రిలీజైతే మహాసముద్రం రిలీజ్ డేట్ మారే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. బాలకృష్ణ అఖండ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖచ్చితంగా సాధిస్తారని అభిమానులు నమ్ముతున్నారు. ఇప్పటికే రిలీజైన అఖండ టీజర్లు సినిమాపై అంచనాలను భారీస్థాయిలో పెంచాయి.
బాలయ్యకు జోడీగా ఈ సినిమాలో పూర్ణ, ప్రగ్య జైస్వాల్ నటిస్తున్నారు. దాదాపు 70 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. బాలయ్యకు విలన్ గా శ్రీకాంత్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే తనకు మరిన్ని విలన్ ఆఫర్స్ వస్తాయని శ్రీకాంత్ అభిప్రాయపడుతున్నారు.