Balakrishna: ‘పెద్దాయన’ గెటప్ లో బాలయ్య..!

నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ సినిమాతో ఎంత పెద్ద హిట్ అందుకున్నారో తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. నిన్ననే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తెలంగాణ సిరిసిల్ల ప్రాంతంలో మొదలైంది. రామ్ ల‌క్ష్మ‌ణ్ మాస్ట‌ర్స్ నేతృత్వంలో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా లొకేషన్ నుంచి ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Click Here To Watch

అందులో బాలయ్య సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో దర్శహనమిచ్చారు. షర్ట్ వేసుకొని లుంగీ కట్టుకొని పెద్దాయన గెటప్ లో కనిపించారు. ఈ లుక్ లో బాలయ్యను చూసిన అభిమానులు తెగ మురిసిపోతున్నారు. కథ ప్రకారం.. సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నారని సమాచారం. అందులో ఒకటి అరవై ఏళ్ల క్యారెక్టర్ కాగా.. మరొకటి యంగేజ్ రోల్ అని తెలుస్తోంది. ఈ సినిమాకి ‘పెద్దాయన’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. సినిమాలో బాలయ్య 60 ఇయర్స్ క్యారెక్టర్ కి మంచి ఇంపార్టెన్స్ ఉంటుందట.

అందుకే ఆ క్యారెక్టర్ కి తగిన్నట్లుగా టైటిల్ పెట్టాలనుకుంటున్నారు. అయితే షూటింగ్ మొదలైన మొదటిరోజే బాలయ్య లుక్ లీక కావడమనేది నిర్మాతలను కాస్త టెన్షన్ పెట్టే విషయమే. లీకుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుంది. కన్నడ స్టార్ దునియా విజయ్ ఇందులో విలన్ గా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus