Balayya Babu: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న బాలయ్య NBK107?

నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమా వస్తుందంటే ప్రేక్షకుల హంగామా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక బాలయ్య సినిమా అంటే సినిమాపై ఎన్నో అంచనాలు కూడా ఉంటాయి. ఇకపోతే తాజాగా బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాలను అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాతో బాలకృష్ణ 200 కోట్ల క్లబ్ లో చేరిపోయారు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మలినేనితో చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగ షూటింగ్ పనులను జరుపుకుంటుంది. NBK107 అనేవర్కింగ్ టైటిల్ తో తెరకేక్కుతున్న ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాపై నందమూరి అభిమానులు ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. ఇకపోతే ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర బృందం భావించారు. సంక్రాంతి అంటేనే తప్పకుండా సంక్రాంతి బరిలో బాలయ్య సినిమా ఉండాల్సిందే.

ఈసారి కూడా గోపీచంద్ బాలకృష్ణ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవుతుందని ముందుగా వార్తలు వచ్చినప్పటికీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అనుకున్న దానికన్నా ముందుగానే విడుదల అవుతుందని తెలుస్తోంది. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ఈ సినిమా డిసెంబర్ నెల మొదటి వారం లేదా రెండవ వారంలోనే విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

అందుకే ఈ సినిమాని ముందుగానే విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతిహాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే బాలకృష్ణ కరోనా బారిన పడటంతో గత కొద్ది రోజుల నుంచి ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉండడంతో త్వరలోనే షూటింగ్లో పాల్గొనబోతున్నారని సమాచారం.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus