“ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు” చిత్రాలు దారుణమైన పరాజయం పాలవ్వడంతో.. బాలయ్య ఉన్నట్లుండి సైలెంట్ అయిపోయాడు. ఆ సినిమాలు కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యాయి అనే బాధకంటే.. ఎన్టీఆర్ ను దేవుడిలా భావించే జనాలు సైతం సినిమా చూడడానికి ఆసక్తి చూపించకపోవడం పట్ల బాలయ్య బాగా బాధపడ్డాడు. ఒకపక్క ఎలక్షన్స్ కూడా వస్తుండడంతో.. బాలయ్య తన దృష్టి మొత్తం రాజకీయాల మీద సారిస్తున్నాడు. ముఖ్యంగా.. నందమూరి కుటుంబానికి కంచుకోట లాంటి హిందూపూర్ నియోజకవర్గంలోనే టిడిపి ఇమేజ్ కు బీటలు బారుతుండడంతో అక్కడ పరువు కాపాడుకోవడం బాలయ్యకు చాలా ఇంపార్టెంట్ గా మారింది.
అందుకే.. “ఎన్టీఆర్ మహానాయకుడు” విడుదల తర్వాత ఇమ్మీడియట్ గా మొదలెడదామనుకున్న బోయపాటి సినిమాను కొన్ని నెలలపాటు హోల్డ్ లో పెట్టాడు బాలయ్య. ఆంధ్రాలో ఎన్నికలు మరియు రిజల్ట్స్ పూర్తయ్యాక అనగా.. మే చివర్లో లేదా జూన్ లో బాలయ్య-బోయపాటిల సినిమా మొదలవుతుందన్నమాట. సో, బోయపాటి అప్పటివరకూ బాలయ్య కథకు ఇంకాస్త మెరుగులు దిద్దడమో.. లేక కొత్త కథలు రాసుకోవడమో చేయాలి.