బోయపాటిని బౌండెడ్ స్క్రిప్ట్ అడిగిన బాలకృష్ణ
- February 4, 2019 / 06:26 AM ISTByFilmy Focus
బాలయ్య ఇప్పటివరకూ 103 సినిమాలు చేశారు. కానీ ఇప్పటివరకూ షూటింగ్ కి వెళ్ళడానికి ముందు ఎన్నడూ ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేసుకోలేదు. ఇక బోయపాటి గురించి వేరే చెప్పాలా.. ఆయన సెట్ లో కూర్చుని సీన్స్ రాస్తుంటాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల సంగతి వేరేగా చెప్పాలా. “సింహా, లెజెండ్” సినిమాలు దాదాపుగా ఒకే తరహాలో ఉంటాయి. ఇక రానున్న మూడో సినిమాలో కూడా బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడని, ఒక పాత్ర ముఖ్యమంత్రి అని తెలియగానే ఇది కూడా ఆ తరహాలో సాగే సినిమానే అని ఫిక్స్ అయిపోయారు జనాలు.
- ఒక రాత్రికి కోటి ఇస్తారట : సాక్షి చౌదరి
- ‘సూసైడ్ చేసుకోవాలనుకున్నా’… అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన జయప్రద.
- ‘మహర్షి’ చిత్రానికి పూజా హెగ్దే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
మరి ఈ విషయం బాలయ్య దాకా వెళ్ళిందో లేక తన మునుపటి సినిమాల రిజల్ట్స్ ను దృష్టిలో పెట్టుకొని ఇలా చేశాడో తెలియదు కానీ.. బోయపాటిని బౌండెడ్ స్క్రిప్ట్ తీసుకొని రమ్మన్నాడట. దాంతో బోయపాటి కూడా ప్రీప్రొడక్షన్ వర్క్ ఇంకాస్త వేగవంతం చేశాడు. సో, ఇమ్మీడియట్ గా మొదలెడదామనుకున్న బాలయ్య సినిమా ఇంకాస్త లేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.















